మఱి తరువాతఁ దానే మన్నించీ నన్ను
(॥పల్లవి॥)
మఱి తరువాతఁ దానే మన్నించీ నన్ను
యెఱిఁగించి రమణుని నీడకుఁ దోడి తేరే
(॥॥)
వేడుకలు తనుపేరు వీనుల వింటేఁ గలుగు
సూడిదె కోరిక తన్నుఁ జూచితేఁ గల్గు
అడుకొన్నబాసమాట లాడుకొనఁ గానే కలుగు
వాడిక తనకాఁగిటఁ గూడితేఁ గలుగును
(॥॥)
జమళిసిగ్గులు దన్ను చన్నుల నొత్తితేఁ గల్గు
తమకము దనపొందు దక్కితేఁ గల్గు
సమరతులెల్లా మోవి చవిగొంటేనే కలుగు
చెమటలసాములు చెనకితేఁ గలుగు
(॥॥)
మన మచ్చిక తాను మన్నించితేఁ గలుగు
ననుపులు నటనలు నవ్వితేఁ గల్గు
యెనసె శ్రీవేంకటేశుఁడే నలమేల్మంగను
పను నీడేరెను తనుఁ బాయకుండాఁ గలుగు
(||pallavi||)
maṟi taruvādam̐ dāne manniṁchī nannu
yĕṟim̐giṁchi ramaṇuni nīḍagum̐ doḍi tere
(||||)
veḍugalu tanuberu vīnula viṁṭem̐ galugu
sūḍidĕ koriga tannum̐ jūsidem̐ galgu
aḍugŏnnabāsamāḍa lāḍugŏnam̐ gāne kalugu
vāḍiga tanagām̐giḍam̐ gūḍidem̐ galugunu
(||||)
jamaḽisiggulu dannu sannula nŏttidem̐ galgu
tamagamu danabŏṁdu dakkidem̐ galgu
samaradulĕllā movi savigŏṁṭene kalugu
sĕmaḍalasāmulu sĕnagidem̐ galugu
(||||)
mana machchiga tānu manniṁchidem̐ galugu
nanubulu naḍanalu navvidem̐ galgu
yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ḍe nalamelmaṁganu
panu nīḍerĕnu tanum̐ bāyaguṁḍām̐ galugu