మఱి తనుఁ బాసిన మము బోఁటికిఁ గా
(॥పల్లవి॥)
మఱి తనుఁ బాసిన మము బోఁటికిఁ గా-
కెఱిఁగెఱిఁ గివి తను నెలయించీనా
(॥॥)
చిత్తజుగురుఁడట జిగిఁ బూబాణపు-
కత్తులు తను మరి కాఁడీనా
పొత్తులచంద్రుఁడు భువిఁదనమఱఁ దెట
వత్తిగఁదనపై వడ చల్లీనా
(॥॥)
వంచినకోవిల వాకట్టువాఁడట
ముంచి కోవిలలు మొఱసీనా
పెంచి గాలిదినుపెనుఁబాము పరపట
పంచలఁదను నవి భ్రమయించీనా
(॥॥)
మతిఁ దా వసంతమాధవుఁడట మరి
తతి నామని తనుఁ దడవీనా
యితవుగ శ్రీ వేంకటేశుఁడు తాఁగూడె
రతి నిద్దరికిని రారాఁపయ్యీనా
(||pallavi||)
maṟi tanum̐ bāsina mamu bom̐ṭigim̐ gā-
kĕṟim̐gĕṟim̐ givi tanu nĕlayiṁchīnā
(||||)
sittajugurum̐ḍaḍa jigim̐ būbāṇabu-
kattulu tanu mari kām̐ḍīnā
pŏttulasaṁdrum̐ḍu bhuvim̐danamaṟam̐ dĕḍa
vattigam̐danabai vaḍa sallīnā
(||||)
vaṁchinagovila vāgaṭṭuvām̐ḍaḍa
muṁchi kovilalu mŏṟasīnā
pĕṁchi gālidinubĕnum̐bāmu parabaḍa
paṁchalam̐danu navi bhramayiṁchīnā
(||||)
madim̐ dā vasaṁtamādhavum̐ḍaḍa mari
tadi nāmani tanum̐ daḍavīnā
yidavuga śhrī veṁkaḍeśhum̐ḍu tām̐gūḍĕ
radi niddarigini rārām̐payyīnā