మఱి నేనేమి సేయఁగలను మాధవ నా శక్తిగల దిదియే
(॥పల్లవి॥)
మఱి నేనేమి సేయఁగలను మాధవ నా శక్తిగల దిదియే
నెఱవుగ భువిలోఁ గలిగిన వెల్లా నీ సొమ్ములే కలవి
(॥మఱి॥)
ధరణిధరా నా తపమనఁగా నేఁటిది
యిరవుగ నా మనసు మీఁదెత్తుట యింతే నీకు
పరగఁగ నాలోని భక్తి యనఁగా నేఁటిది
సరుగన నా యాతుమ నీకు సమర్పణ యనుటే
(॥మఱి॥)
సుడిగొని నీపై నా స్తుతి యనఁగా నేఁటిది
నుడిగిన నా నుడుగులు నీకు నోరనే యర్పించితి ననుటే
వడిగా నేఁ గైకొన్న వ్రత మనఁగా నేఁటిది
జడియక నీవాఁడ ననుకొనుచు శరణనుటే కలది
(॥మఱి॥)
శ్రీవేంకటేశ నా శీలం బనఁగా నేఁటిది
దావతిపడక నీ దాసులకు దాఁడ నే నను టింతే
వేవేలుగ నేఁ బూజించే విధ మనఁగా నేఁటిది
భావమున నలమేలుమంగపతివి నీపాదములకు మొక్కుటయింతే
(||pallavi||)
maṟi nenemi seyam̐galanu mādhava nā śhaktigala didiye
nĕṟavuga bhuvilom̐ galigina vĕllā nī sŏmmule kalavi
(||maṟi||)
dharaṇidharā nā tabamanam̐gā nem̐ṭidi
yiravuga nā manasu mīm̐dĕttuḍa yiṁte nīgu
paragam̐ga nāloni bhakti yanam̐gā nem̐ṭidi
sarugana nā yāduma nīgu samarbaṇa yanuḍe
(||maṟi||)
suḍigŏni nībai nā studi yanam̐gā nem̐ṭidi
nuḍigina nā nuḍugulu nīgu norane yarbiṁchidi nanuḍe
vaḍigā nem̐ gaigŏnna vrada manam̐gā nem̐ṭidi
jaḍiyaga nīvām̐ḍa nanugŏnusu śharaṇanuḍe kaladi
(||maṟi||)
śhrīveṁkaḍeśha nā śhīlaṁ banam̐gā nem̐ṭidi
dāvadibaḍaga nī dāsulagu dām̐ḍa ne nanu ṭiṁte
veveluga nem̐ būjiṁche vidha manam̐gā nem̐ṭidi
bhāvamuna nalamelumaṁgabadivi nībādamulagu mŏkkuḍayiṁte