మఱి నేనే చెప్పేనంటే మందెమేళ మందురు
(॥పల్లవి॥)
మఱి నేనే చెప్పేనంటే మందెమేళ మందురు
మెఱసెఁ దన గుణాలు మెచ్చితి నే ననవే
(॥మఱి॥)
అతనిఁ గంటే చెలియ అడిగితిననవే
తతి దప్పకుండా తనుఁ దలఁతు నేననవే
మతిలోఁ దనపొందులు మరిగితి ననవే
చతురుఁ డీడకువచ్చి చనవు లిమ్మనవే
(॥మఱి॥)
మొదలనే తనకు నే మొక్కిలి నే ననవే
పదివేలకుఁ దనపై బత్తి గలననవే
చెదరక తనమేలు చెప్పకొందు ననవే
కదిసి న న్నిందరిలోఁ గరుణించుమనవే
(॥మఱి॥)
మిక్కిలిఁ దనకు నేను మేలు దాన ననవే
చక్కఁగాఁ దన రతులు సారె మెత్తుననవే
అక్కరో శ్రీవేంకటేశుఁ దంతలో దా వచ్చి కూడె
యిక్కడనే వుండి నన్ను నెడయకు మనవే
(||pallavi||)
maṟi nene sĕppenaṁṭe maṁdĕmeḽa maṁduru
mĕṟasĕm̐ dana guṇālu mĕchchidi ne nanave
(||maṟi||)
adanim̐ gaṁṭe sĕliya aḍigidinanave
tadi dappaguṁḍā tanum̐ dalam̐tu nenanave
madilom̐ danabŏṁdulu marigidi nanave
sadurum̐ ḍīḍaguvachchi sanavu limmanave
(||maṟi||)
mŏdalane tanagu ne mŏkkili ne nanave
padivelagum̐ danabai batti galananave
sĕdaraga tanamelu sĕppagŏṁdu nanave
kadisi na nniṁdarilom̐ garuṇiṁchumanave
(||maṟi||)
mikkilim̐ danagu nenu melu dāna nanave
sakkam̐gām̐ dana radulu sārĕ mĕttunanave
akkaro śhrīveṁkaḍeśhum̐ daṁtalo dā vachchi kūḍĕ
yikkaḍane vuṁḍi nannu nĕḍayagu manave