మఱి నీవేమిసేసినా మంచిదేకాక
(॥పల్లవి॥)
మఱి నీవేమిసేసినా మంచిదేకాక
జఱసి నిన్ను మార్కొన చలమా యిది
(॥మఱి॥)
చెలరేఁగి నీవు నాచేతికి విడెమియ్యఁగా
బలిమిఁ బట్టకుండఁగా పంతమా యిది
వెలలేనివేడుకతో విరుల నన్ను వేయఁగా
మలసి తప్పించుకొన(న) మదమా ఇది
(॥మఱి॥)
అదిగొని నీవు నాఆయములు ముట్టఁగాను
కాదని చేపట్టితోయ గర్వమా యిది
అదరించి నీవు నన్ను అలుకలు దేర్చగాను
సాదించ నీతోడి మచ్చరమా ఇది
(॥మఱి॥)
నగుతా శ్రీవేంకటేశ నన్ను నీవు గూడఁగాను
యెగసక్కెలాడ నాకు యెమ్మెలా యిది
తగినరతుల నన్నుఁ దనియఁగఁ జేయఁగాను
సొగిసి నేఁ గొసర నాసోదమా యిది
(||pallavi||)
maṟi nīvemisesinā maṁchidegāga
jaṟasi ninnu mārgŏna salamā yidi
(||maṟi||)
sĕlarem̐gi nīvu nāsedigi viḍĕmiyyam̐gā
balimim̐ baṭṭaguṁḍam̐gā paṁtamā yidi
vĕlaleniveḍugado virula nannu veyam̐gā
malasi tappiṁchugŏna(na) madamā idi
(||maṟi||)
adigŏni nīvu nāāyamulu muṭṭam̐gānu
kādani sebaṭṭidoya garvamā yidi
adariṁchi nīvu nannu alugalu dersagānu
sādiṁcha nīdoḍi machcharamā idi
(||maṟi||)
nagudā śhrīveṁkaḍeśha nannu nīvu gūḍam̐gānu
yĕgasakkĕlāḍa nāgu yĕmmĕlā yidi
taginaradula nannum̐ daniyam̐gam̐ jeyam̐gānu
sŏgisi nem̐ gŏsara nāsodamā yidi