Maṟi nee veppudu naagu mamchivaamdave kaavaa

మఱి నీ వెప్పుడు నాకు మంచివాఁడవే కావా
Language

(॥పల్లవి॥)
మఱి నీ వెప్పుడు నాకు మంచివాఁడవే కావా
గుఱిగాఁ బాదాలు చూపు కోరి మొక్కే నేను

(॥మఱి॥)
నంటున నీ వొకతెతో నవ్వుతా రాఁగాఁ జూచి
కంటకా లాడవచ్చునా గయ్యళిఁ గాక
యింటికి నీవే వచ్చి యిచ్చకము లాడఁగాను
వుంటవింట వేము టెట్టు వోరువఁ జాలఁ గాక

(॥మఱి॥)
పాయక యాపె నీవు పానుపుపై నుండఁ గాను
రాయడించ వచ్చునా రట్టడిఁ గాక
చేయి వట్టుకొని నీవు చేరి నన్ను వేఁడుకోఁగా
తోయవచ్చునా నేను తుంటరిఁ గాక

(॥మఱి॥)
వసమై మీ రిద్దరును వడి నన్ను బోదించఁగా
కసురుకోవచ్చునా నాగర్వము గాక
యెసఁగి శ్రీవెంకటేశ యిట్టె నన్ను నేలితివి
కొసరి నవ్వు టెట్టు నాగుణ మింతే గాక

(||pallavi||)
maṟi nī vĕppuḍu nāgu maṁchivām̐ḍave kāvā
guṟigām̐ bādālu sūbu kori mŏkke nenu

(||maṟi||)
naṁṭuna nī vŏgadĕdo navvudā rām̐gām̐ jūsi
kaṁṭagā lāḍavachchunā gayyaḽim̐ gāga
yiṁṭigi nīve vachchi yichchagamu lāḍam̐gānu
vuṁṭaviṁṭa vemu ṭĕṭṭu voruvam̐ jālam̐ gāga

(||maṟi||)
pāyaga yābĕ nīvu pānububai nuṁḍam̐ gānu
rāyaḍiṁcha vachchunā raṭṭaḍim̐ gāga
seyi vaṭṭugŏni nīvu seri nannu vem̐ḍugom̐gā
toyavachchunā nenu tuṁṭarim̐ gāga

(||maṟi||)
vasamai mī riddarunu vaḍi nannu bodiṁcham̐gā
kasurugovachchunā nāgarvamu gāga
yĕsam̐gi śhrīvĕṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi
kŏsari navvu ṭĕṭṭu nāguṇa miṁte gāga