(॥పల్లవి॥)
మఱవరే మాట మనసొకలాగయ్యీ
యెఱఁగనైతిగాక యెరవు సతమౌనా
(॥మఱ॥)
చెల్లులేవే యిఁకఁ దాను చేసినచేఁతలెల్లా
మొల్లమిఁ గొలుముందై నే మోహించితిని
ఇల్లిదె యెక్కినవాని కేనుగ గుజ్జనుమాట
పొల్లవునా తన్నూరకె పొదిగే నేఁ గాక
(॥మఱ॥)
తగులేవే ఇఁక నేఁడు తానాడేమాటలెల్లా
వెగటై తా విడిచినా విడువలేను
వగ విరిగినబండివారే వెఱ్ఱులన్నమాఁట
నెగడియుండఁగా నేనే నేర వింతేకాక
(॥మఱ॥)
మించెలేవే తాఁ జేసినమేకులవినయమెల్లా
కొంచక తనకాఁగిటఁ గూడితి నేను
అంచె శ్రీవేంకటశుఁ దన్నంటితేఁ దనంతనేది
మంచిదిగాదా నేనే మఱచితిఁగాక
(||pallavi||)
maṟavare māḍa manasŏgalāgayyī
yĕṟam̐ganaidigāga yĕravu sadamaunā
(||maṟa||)
sĕlluleve yim̐kam̐ dānu sesinasem̐talĕllā
mŏllamim̐ gŏlumuṁdai ne mohiṁchidini
illidĕ yĕkkinavāni kenuga gujjanumāḍa
pŏllavunā tannūragĕ pŏdige nem̐ gāga
(||maṟa||)
taguleve im̐ka nem̐ḍu tānāḍemāḍalĕllā
vĕgaḍai tā viḍisinā viḍuvalenu
vaga viriginabaṁḍivāre vĕṭrulannamām̐ṭa
nĕgaḍiyuṁḍam̐gā nene nera viṁtegāga
(||maṟa||)
miṁchĕleve tām̐ jesinamegulavinayamĕllā
kŏṁchaga tanagām̐giḍam̐ gūḍidi nenu
aṁchĕ śhrīveṁkaḍaśhum̐ dannaṁṭidem̐ danaṁtanedi
maṁchidigādā nene maṟasidim̐gāga