మఱవఁగఁ బోలుదురు మనసులోపల మీరు
(॥పల్లవి॥)
మఱవఁగఁ బోలుదురు మనసులోపల మీరు
తఱితోడ నేనైనాఁ దలపించే నిఁకను
(॥మఱ॥)
మేడమీఁదఁ గూచుండి మేమువచ్చే దెఱఁగక
ఆడరా జాణతనా లాపెయు నీవు
ఆడనెకాదా మరీనందుకొంటిరి విడేలు
వేడుకై నే నడిగితే వెరగందే రిపుడు
(॥మఱ॥)
సింగారపుఁదోఁటలోన చేరి నేము నుండఁగానె
అంగవించి నవ్వుకోరా ఆకెయు నీవు
చెంగట నప్పుడేకాదా చేసన్న చేసుకొంటిరి
సంగడి నేఁ జూచితేను సాదించే రిపుడు
(॥మఱ॥)
పట్టెమంచము మీఁదను పాదాలు నే నొత్తఁగానే
అట్టె కాఁగిలించుకోరా ఆకెయు నీవు
నెట్టన శ్రీవేంకటేశ నేఁడు నన్ను నేలితివి
చుట్టరికాలు చెప్పితే సోద్యమందే రిపుడు
(||pallavi||)
maṟavam̐gam̐ boluduru manasulobala mīru
taṟidoḍa nenainām̐ dalabiṁche nim̐kanu
(||maṟa||)
meḍamīm̐dam̐ gūsuṁḍi memuvachche dĕṟam̐gaga
āḍarā jāṇadanā lābĕyu nīvu
āḍanĕgādā marīnaṁdugŏṁṭiri viḍelu
veḍugai ne naḍigide vĕragaṁde ribuḍu
(||maṟa||)
siṁgārabum̐dom̐ṭalona seri nemu nuṁḍam̐gānĕ
aṁgaviṁchi navvugorā āgĕyu nīvu
sĕṁgaḍa nappuḍegādā sesanna sesugŏṁṭiri
saṁgaḍi nem̐ jūsidenu sādiṁche ribuḍu
(||maṟa||)
paṭṭĕmaṁchamu mīm̐danu pādālu ne nŏttam̐gāne
aṭṭĕ kām̐giliṁchugorā āgĕyu nīvu
nĕṭṭana śhrīveṁkaḍeśha nem̐ḍu nannu nelidivi
suṭṭarigālu sĕppide sodyamaṁde ribuḍu