మఱవఁగ నియ్యదు రేఁచును మాయాప్రపంచ మిదివో
(॥పల్లవి॥)
మఱవఁగ నియ్యదు రేఁచును మాయాప్రపంచ మిదివో
తెఱఁగిఁక నేదో తెలియదు దేహము మోచినను
(॥మఱవ॥)
యెక్కడి మనోరథంబులు యెన్నో తలఁపునఁ బారును
తక్కక భుజించి యేకాంతంబున నున్నపుడు
చొక్కపు చుట్టరికంబులు చుట్టుక యింటికి వచ్చును
గక్కన సంసారబంధము కట్టుకొనినయంతా
(॥మఱవ॥)
పెనగొని పంతపుమాటలు వెక్కులు నోరను వెడలును
గొనకొని నలుగురిలోపలఁ గూచుండిన వేళ
వనితలు వద్దనె వుండిన తావులు తానే కూడును
మన సొడఁబడి తనలోఁ గామము మిక్కుటమైనా
(॥మఱవ॥)
చేతులఁ బెనగొని కర్మము చేతఁలు యేమో సేయించు
యేతుల రాజ్యమదంబున నెనసిన సమయమునా
యీతల శ్రీవేంకటేశ్వర యేలితి విటు నను నీవే
కౌతుకముగ శరణాగతి కాచును మమ్మెపుడు
(||pallavi||)
maṟavam̐ga niyyadu rem̐sunu māyāprabaṁcha midivo
tĕṟam̐gim̐ka nedo tĕliyadu dehamu mosinanu
(||maṟava||)
yĕkkaḍi manorathaṁbulu yĕnno talam̐punam̐ bārunu
takkaga bhujiṁchi yegāṁtaṁbuna nunnabuḍu
sŏkkabu suṭṭarigaṁbulu suṭṭuga yiṁṭigi vachchunu
gakkana saṁsārabaṁdhamu kaṭṭugŏninayaṁtā
(||maṟava||)
pĕnagŏni paṁtabumāḍalu vĕkkulu noranu vĕḍalunu
gŏnagŏni nalugurilobalam̐ gūsuṁḍina veḽa
vanidalu vaddanĕ vuṁḍina tāvulu tāne kūḍunu
mana sŏḍam̐baḍi tanalom̐ gāmamu mikkuḍamainā
(||maṟava||)
sedulam̐ bĕnagŏni karmamu sedam̐lu yemo seyiṁchu
yedula rājyamadaṁbuna nĕnasina samayamunā
yīdala śhrīveṁkaḍeśhvara yelidi viḍu nanu nīve
kaudugamuga śharaṇāgadi kāsunu mammĕbuḍu