మఱవకువే చెలియ మదనరహస్య మిది
(॥పల్లవి॥)
మఱవకువే చెలియ మదనరహస్య మిది
యెఱుఁగుకొంటే మేలు ఇందులోనే వున్నది
(॥మఱ॥)
సేయరాని వినయము సేసితే దంపతులకు
పాయనిచుట్టరికమై పైకొనును
యేయెడా మొగమోటము లెప్పుడు గలిగితేను
మోయరానిమోపులై మునుకొను మోహము
(॥మఱ॥)
యేపొద్దు మంచితనాన నెనసితే జాణలకు
దాఁపురాలై వేడుకలు తతిగొనును
కాఁపురపుసరవులే కడుఁగడు కరపితే
ఆఁపరాని తమకము లలవడివుండును
(॥మఱ॥)
తిరమైన రతులద్దితే నేరుపరులకు
సరససల్లాపములు చవులు మించు
యిరవై శ్రీవేంకటేశుఁ డింతలోనె నిన్నుఁగూడె
వరుసతో మెలఁగితే వలపు లీడేరును
(||pallavi||)
maṟavaguve sĕliya madanarahasya midi
yĕṟum̐gugŏṁṭe melu iṁdulone vunnadi
(||maṟa||)
seyarāni vinayamu seside daṁpadulagu
pāyanisuṭṭarigamai paigŏnunu
yeyĕḍā mŏgamoḍamu lĕppuḍu galigidenu
moyarānimobulai munugŏnu mohamu
(||maṟa||)
yebŏddu maṁchidanāna nĕnaside jāṇalagu
dām̐purālai veḍugalu tadigŏnunu
kām̐purabusaravule kaḍum̐gaḍu karabide
ām̐parāni tamagamu lalavaḍivuṁḍunu
(||maṟa||)
tiramaina raduladdide nerubarulagu
sarasasallābamulu savulu miṁchu
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ ninnum̐gūḍĕ
varusado mĕlam̐gide valabu līḍerunu