Maṟavaguvayya neevu maada lennainaam galavu

మఱవకువయ్య నీవు మాట లెన్నైనాఁ గలవు
Language

(॥పల్లవి॥)
మఱవకువయ్య నీవు మాట లెన్నైనాఁ గలవు
తఱవాతఁ జేసేటి తగవు నీ చేతిది

(॥॥)
మందలించి నీవు నన్ను మన్నించుకున్నాఁడవు
యెందాకా విన్నపాలు నీ కేమి సేసేది
యిందరివలెనే నేను యెరవుల దానఁగాను
పొందినట్టి నా పాలిటి పుణ్యము నీ చేతిది

(॥॥)
నిచ్చలు నామతిలోన నీవె నాకుఁ గలవు
యెచ్చరించ సారె సారె నేటికి మాకు
బచ్చెనచేఁ తల నిన్ను భ్రమయించేదానఁ గాను
పచ్చి దీర నా కిచ్చిన బాసలు నీ చేతివి

(॥॥)
కొత్తగాఁ గౌఁగిట నన్నుఁ గూడితి విప్పుడే నీవు
యెత్తినచేతుల నీకు నేడ మొక్కేది
అత్తిన శ్రీవేంకటేశ అలమేలుమంగ నేను
పొత్తుల నుండిన నా భోగము నీ చేతిది.

(||pallavi||)
maṟavaguvayya nīvu māḍa lĕnnainām̐ galavu
taṟavādam̐ jeseḍi tagavu nī sedidi

(||||)
maṁdaliṁchi nīvu nannu manniṁchugunnām̐ḍavu
yĕṁdāgā vinnabālu nī kemi sesedi
yiṁdarivalĕne nenu yĕravula dānam̐gānu
pŏṁdinaṭṭi nā pāliḍi puṇyamu nī sedidi

(||||)
nichchalu nāmadilona nīvĕ nāgum̐ galavu
yĕchchariṁcha sārĕ sārĕ neḍigi māgu
bachchĕnasem̐ tala ninnu bhramayiṁchedānam̐ gānu
pachchi dīra nā kichchina bāsalu nī sedivi

(||||)
kŏttagām̐ gaum̐giḍa nannum̐ gūḍidi vippuḍe nīvu
yĕttinasedula nīgu neḍa mŏkkedi
attina śhrīveṁkaḍeśha alamelumaṁga nenu
pŏttula nuṁḍina nā bhogamu nī sedidi.