(॥పల్లవి॥)
మఱవకుమీ మాట మతిలోనను
జఱసి నీవేమనినా సమ్మతించేదానను
(॥మఱ॥)
చింతదీరె నీవు నాపైఁ జేయివేసినయప్పుడే
మంతనాన బుజ్జగించ మఱివలెనా
వింతదాననా నేను విభుఁడవు నీవు నన్ను
యెంత సేసినా నటె యియ్యకొందుఁగాక
(॥మఱ॥)
తనివిఁబొందెను నీవు దగ్గరినయప్పుడే
మనసు రంజిల్లఁ జేయ మఱివలెనా
నను నీ వెఱఁగవా నమ్మికిచ్చినవాఁడవు
పనిగొన్నయందుకెల్లా పంపుసేతుఁగాక
(॥మఱ॥)
మెచ్చితిని నీవు నన్ను మేకొనికూడినప్పుడే
మచ్చికలు వచరించ మఱివలెనా
యిచ్చకుఁడ శ్రీవేంకటేశ నీయిల్లాలను
తచ్చివేసినట్టు నిన్ను తగిలుందుఁగాక
(||pallavi||)
maṟavagumī māḍa madilonanu
jaṟasi nīvemaninā sammadiṁchedānanu
(||maṟa||)
siṁtadīrĕ nīvu nābaim̐ jeyivesinayappuḍe
maṁtanāna bujjagiṁcha maṟivalĕnā
viṁtadānanā nenu vibhum̐ḍavu nīvu nannu
yĕṁta sesinā naḍĕ yiyyagŏṁdum̐gāga
(||maṟa||)
tanivim̐bŏṁdĕnu nīvu daggarinayappuḍe
manasu raṁjillam̐ jeya maṟivalĕnā
nanu nī vĕṟam̐gavā nammigichchinavām̐ḍavu
panigŏnnayaṁdugĕllā paṁpusedum̐gāga
(||maṟa||)
mĕchchidini nīvu nannu megŏnigūḍinappuḍe
machchigalu vasariṁcha maṟivalĕnā
yichchagum̐ḍa śhrīveṁkaḍeśha nīyillālanu
tachchivesinaṭṭu ninnu tagiluṁdum̐gāga