Maṟavagu nee gunamu manasulodaana nenu

మఱవకు నీ గుణము మనసులోదాన నేను
Language

(॥పల్లవి॥)
మఱవకు నీ గుణము మనసులోదాన నేను
యెఱిఁగె లోక మెల్లా న న్నేలితి వంటాను

(॥॥)
విన్నపము సేసితిఁగా వింటివిగా నా మాట
నిన్ను నే మనఁగలను నీ చిత్తము
యెన్నిక సేసుకొంటివి యింతగా మన్నించితివి
పన్నుకొన్న నీ కరుణే పదివేలు నాకు

(॥॥)
కానుక నీ కిచ్చితిఁగా కంటివిగా నీవు నన్ను
సే నెంతదాన నీకు నీ చిత్తము
కానిమ్మని కైకొంటివి కంకణము గట్టి తివి
నీ నవ్వుల సరసమే నిధానము నాకు

(॥॥)
కమ్మటి మొక్కితిఁ గా కౌఁగిలించుకొంటివిగా
నెమ్మదినుండే నేను నీ చిత్తము
సమ్మతించి శ్రీ వేంకటేశ్వర నన్నుఁ గూడితివి
పమ్మిన నీ వూడిగమే భాగ్యమెల్లా నాకు

(||pallavi||)
maṟavagu nī guṇamu manasulodāna nenu
yĕṟim̐gĕ loga mĕllā na nnelidi vaṁṭānu

(||||)
vinnabamu sesidim̐gā viṁṭivigā nā māḍa
ninnu ne manam̐galanu nī sittamu
yĕnniga sesugŏṁṭivi yiṁtagā manniṁchidivi
pannugŏnna nī karuṇe padivelu nāgu

(||||)
kānuga nī kichchidim̐gā kaṁṭivigā nīvu nannu
se nĕṁtadāna nīgu nī sittamu
kānimmani kaigŏṁṭivi kaṁkaṇamu gaṭṭi tivi
nī navvula sarasame nidhānamu nāgu

(||||)
kammaḍi mŏkkidim̐ gā kaum̐giliṁchugŏṁṭivigā
nĕmmadinuṁḍe nenu nī sittamu
sammadiṁchi śhrī veṁkaḍeśhvara nannum̐ gūḍidivi
pammina nī vūḍigame bhāgyamĕllā nāgu