మఱచినవారి నేల మఱవ నియ్యవు మమ్ము
(॥పల్లవి॥)
మఱచినవారి నేల మఱవ నియ్యవు మమ్ము
వెఱచినవారి నేల వెఱపించ నేఁటికే
(॥మఱచిన॥)
నీకుఁ గట్టినట్టితాళి నీమారు సేసుకొని
యేకచిత్తమున నే నింట నుండఁగా
పైకొని పిలిపించేవు పడఁతుల నంపి నన్ను
దీకొని మమ్మింత సేసి దిమ్ము రేఁచ వలనా
(॥మఱచిన॥)
సేస వెట్టిన నీరూపె చిత్తములో నించుకొని
పోసరించి పొద్దు గడపుచు నుండఁగా
ఆస చూపి నీవు నాకు నప్పటి సన్న సేసేవు
వాసితో నుండినవారి వలఁ బెట్ట వలెనా
(॥మఱచిన॥)
తప్పక చూడఁగ నీకు దగ్గరనె నిలుచుండి
దప్పులనుఁ బెడఁబాసి తని వొందఁగా
అప్పుడె శ్రీవెంకటేశ అలమేల్‌మంగను నన్ను
ముప్పిరిగా నిట్టె కూడి మోహించ వలెనా
(||pallavi||)
maṟasinavāri nela maṟava niyyavu mammu
vĕṟasinavāri nela vĕṟabiṁcha nem̐ṭige
(||maṟasina||)
nīgum̐ gaṭṭinaṭṭidāḽi nīmāru sesugŏni
yegasittamuna ne niṁṭa nuṁḍam̐gā
paigŏni pilibiṁchevu paḍam̐tula naṁpi nannu
dīgŏni mammiṁta sesi dimmu rem̐sa valanā
(||maṟasina||)
sesa vĕṭṭina nīrūbĕ sittamulo niṁchugŏni
posariṁchi pŏddu gaḍabusu nuṁḍam̐gā
āsa sūbi nīvu nāgu nappaḍi sanna sesevu
vāsido nuṁḍinavāri valam̐ bĕṭṭa valĕnā
(||maṟasina||)
tappaga sūḍam̐ga nīgu daggaranĕ nilusuṁḍi
dappulanum̐ bĕḍam̐bāsi tani vŏṁdam̐gā
appuḍĕ śhrīvĕṁkaḍeśha alamelmaṁganu nannu
muppirigā niṭṭĕ kūḍi mohiṁcha valĕnā