(॥పల్లవి॥)
మఱచినపని రేఁచ మాకేలే
తఱవాతి పను లిట్టే తమకించనేలే
(॥॥)
పెనఁగి మాయింటికిఁ బిలువఁగ నిలువఁగ
మనసు వచ్చునో రాదో మాకేలే
తమయంతలేనిది తడవ నేమిటి కెంత-
పనిగలిగున్నాఁడో పలికించనేలే
(॥॥)
తెరయెత్తి నేఁజూచి తిరిగితే జరిగితే
మరుతంత్ర మేమౌను మాకేలే
సరసాలే విరసాలు చవిగానిపనులకు
పరిణామ మడిగి నేఁ బచరించనేలే
(॥॥)
ఆరసి యప్పటిసుద్ద లడుగఁగ నొడుగఁగ
మారాక కూరకుండఁగా మాకేలే
చేరువఁ గడపలోన శ్రీ వేంకటేశ్వరుఁడు
గారవాన నన్నుఁ గూడెఁ గాదననేలే
(||pallavi||)
maṟasinabani rem̐sa māgele
taṟavādi panu liṭṭe tamagiṁchanele
(||||)
pĕnam̐gi māyiṁṭigim̐ biluvam̐ga niluvam̐ga
manasu vachchuno rādo māgele
tamayaṁtalenidi taḍava nemiḍi kĕṁta-
panigaligunnām̐ḍo paligiṁchanele
(||||)
tĕrayĕtti nem̐jūsi tirigide jarigide
marudaṁtra memaunu māgele
sarasāle virasālu savigānibanulagu
pariṇāma maḍigi nem̐ basariṁchanele
(||||)
ārasi yappaḍisudda laḍugam̐ga nŏḍugam̐ga
mārāga kūraguṁḍam̐gā māgele
seruvam̐ gaḍabalona śhrī veṁkaḍeśhvarum̐ḍu
gāravāna nannum̐ gūḍĕm̐ gādananele