(॥పల్లవి॥)
మఱచితిననక యేమఱివుంటిననక
యెఱుకగా గుఱుతు నాకిమ్మని యడుగవే
(॥॥)
యెలమితోడుత మాయింటికెపుడు విచ్చేసీ
అలివేణి యాతని నీవడిగి రావే
పొలుపారఁ గూటమికి పొందుగా మాటలాడి
అలరినరతులకు నానవాలు దేవే
(॥॥)
అందుకోలు పెండ్లికి నట్టె సమ్మతించితేను
పెందలకాడ విడె మిప్పించుకరావే
కందువతో వలపులు కడుఁ జవులై తేను
చెంజి యానవెట్టించుక చేకొనిరావే
(॥॥)
చిమ్ముచు నన్నింతలోనె శ్రీ వేంకటేశుఁడు గూడె
పిమ్మటిసేఁతలు దలఁపించిరావే
వుమ్మడి నలమేల్మంగ నొనరితిఁ గాఁగిట
నమ్మికాయ నాకుఁగా విన్నపములు సేయవే
(||pallavi||)
maṟasidinanaga yemaṟivuṁṭinanaga
yĕṟugagā guṟudu nāgimmani yaḍugave
(||||)
yĕlamidoḍuda māyiṁṭigĕbuḍu vichchesī
aliveṇi yādani nīvaḍigi rāve
pŏlubāram̐ gūḍamigi pŏṁdugā māḍalāḍi
alarinaradulagu nānavālu deve
(||||)
aṁdugolu pĕṁḍligi naṭṭĕ sammadiṁchidenu
pĕṁdalagāḍa viḍĕ mippiṁchugarāve
kaṁduvado valabulu kaḍum̐ javulai tenu
sĕṁji yānavĕṭṭiṁchuga segŏnirāve
(||||)
simmusu nanniṁtalonĕ śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕ
pimmaḍisem̐talu dalam̐piṁchirāve
vummaḍi nalamelmaṁga nŏnaridim̐ gām̐giḍa
nammigāya nāgum̐gā vinnabamulu seyave