Maṟaside nemaaya maguvala samdadilo

మఱచితే నేమాయ మగువల సందడిలో
Language

(॥పల్లవి॥)
మఱచితే నేమాయ మగువల సందడిలో
అఱిముఱి వీడె మంపడంటా నలిగేనా

(॥॥)
రమణుల నంప నేల రాయబారా లింత యాల
సముకానఁ జెప్పితేను సమ్మతించనా
తమితోఁ జింతించ నేల తాఁ బోడిఁ బడఁగ(?) నేల
క్రమమునఁ దా బత్తిగలది యెఱుఁగనా

(॥॥)
వుంగర మంపఁ గ నేల వూర కానవెట్ట నేల
రంగుగఁ దాఁ బిలువఁగా రా నన నేల
అంగపుఁ జెమట లేల అట్టే తా విచ్చేయ నేల
సంగడి సరిదాననై సాదించేదాననా

(॥॥)
చేరి మాటాడించ నేల చెక్కులు నొక్కఁగ నేల
గారవించి కూడఁ గాఁగా దనేనా
యీ రీతి శ్రీ వేంకటేశుఁ డెంత దయ సేసె నన్ను
కోరి తన వేడుకకు గుఱియైనదాననూ

(||pallavi||)
maṟaside nemāya maguvala saṁdaḍilo
aṟimuṟi vīḍĕ maṁpaḍaṁṭā naligenā

(||||)
ramaṇula naṁpa nela rāyabārā liṁta yāla
samugānam̐ jĕppidenu sammadiṁchanā
tamidom̐ jiṁtiṁcha nela tām̐ boḍim̐ baḍam̐ga(?) nela
kramamunam̐ dā battigaladi yĕṟum̐ganā

(||||)
vuṁgara maṁpam̐ ga nela vūra kānavĕṭṭa nela
raṁgugam̐ dām̐ biluvam̐gā rā nana nela
aṁgabum̐ jĕmaḍa lela aṭṭe tā vichcheya nela
saṁgaḍi saridānanai sādiṁchedānanā

(||||)
seri māḍāḍiṁcha nela sĕkkulu nŏkkam̐ga nela
gāraviṁchi kūḍam̐ gām̐gā danenā
yī rīdi śhrī veṁkaḍeśhum̐ ḍĕṁta daya sesĕ nannu
kori tana veḍugagu guṟiyainadānanū