Maṟasi vunnaamdemo maguvalaala

మఱచి వున్నాఁడేమో మగువలాల
Language

(॥పల్లవి॥)
మఱచి వున్నాఁడేమో మగువలాల
యెఱుకలు చేసి కానుకియ్యఁ గదరే

(॥మఱ॥)
చిత్తములో తమకము సిగ్గులకు వెఱవదు
కొత్తయిన రతికాంక్ష గుట్టు సేయదు
మొత్తమైనవిరహము ముందువెనక చూడదు
బత్తిగలవిభునికి భావ మెఱిఁగించరే

(॥మఱ॥)
తడబాటు కోరికతగవుఁ దలఁచ నీదు
జడిగొన్నవయసు వేసట చూపదు
వుడివోని యాసకు వూరట యెందూ లేదు
విడువనిపతి కింకీ విన్నవించరే

(॥మఱ॥)
యెనసేటివేడుక యింతంతని చెప్పరాదు
కనుకలీ వినుకలీఁ గడమ గాదు
గొనకొని నన్నింతలోఁగూడె శ్రీవేంకటేశుఁడు
ఘనుఁ డాతనికి నాకందువలు చెప్పిరే

(||pallavi||)
maṟasi vunnām̐ḍemo maguvalāla
yĕṟugalu sesi kānugiyyam̐ gadare

(||maṟa||)
sittamulo tamagamu siggulagu vĕṟavadu
kŏttayina radigāṁkṣha guṭṭu seyadu
mŏttamainavirahamu muṁduvĕnaga sūḍadu
battigalavibhunigi bhāva mĕṟim̐giṁchare

(||maṟa||)
taḍabāḍu korigadagavum̐ dalam̐sa nīdu
jaḍigŏnnavayasu vesaḍa sūbadu
vuḍivoni yāsagu vūraḍa yĕṁdū ledu
viḍuvanibadi kiṁkī vinnaviṁchare

(||maṟa||)
yĕnaseḍiveḍuga yiṁtaṁtani sĕpparādu
kanugalī vinugalīm̐ gaḍama gādu
gŏnagŏni nanniṁtalom̐gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu
ghanum̐ ḍādanigi nāgaṁduvalu sĕppire