మఱచి వుండఁగ రాదు మఱి తలఁచుకో రాదు
(॥పల్లవి॥)
మఱచి వుండఁగ రాదు మఱి తలఁచుకో రాదు
యెఱిఁగెఱిఁగి నా గుణ మింత సేసీ నన్నును
(॥॥)
సారెకు మాటాడే నంటే సంతోసము దొట్టు కొనీ
చేరి మోము చూచేనంటే సిగ్గులు బెట్టు
వూరక వుండేనంటే నుమ్మగిలీఁ దమకము
యీ రీతి నితని పొందు లింతసేసీ నన్నును
(॥॥)
చన్నుల నొత్తే నంటే జల్లున మే చెమరించీ
వున్నతి నవ్వే నంటే నొలికీఁ దేనే
పన్ని సన్న సేసే నంటే పరవశములు నిండీ
యిన్నిటా నితని మేల మింత సేసీ నన్నునూ
(॥॥)
యిట్టే కౌఁగిలించే నంటే ఇక్కువలు గరఁగీని
చుట్టమనై మొక్కీ నంటే చొక్కీ మనసు
గుట్టున నన్నింతలోనే కూడె శ్రీ వేంకటేశుఁడు
యెట్ట నెదుట నా మోహ మెంత సేసీ నన్నును
(||pallavi||)
maṟasi vuṁḍam̐ga rādu maṟi talam̐sugo rādu
yĕṟim̐gĕṟim̐gi nā guṇa miṁta sesī nannunu
(||||)
sārĕgu māḍāḍe naṁṭe saṁtosamu dŏṭṭu kŏnī
seri momu sūsenaṁṭe siggulu bĕṭṭu
vūraga vuṁḍenaṁṭe nummagilīm̐ damagamu
yī rīdi nidani pŏṁdu liṁtasesī nannunu
(||||)
sannula nŏtte naṁṭe jalluna me sĕmariṁchī
vunnadi navve naṁṭe nŏligīm̐ dene
panni sanna sese naṁṭe paravaśhamulu niṁḍī
yinniḍā nidani mela miṁta sesī nannunū
(||||)
yiṭṭe kaum̐giliṁche naṁṭe ikkuvalu garam̐gīni
suṭṭamanai mŏkkī naṁṭe sŏkkī manasu
guṭṭuna nanniṁtalone kūḍĕ śhrī veṁkaḍeśhum̐ḍu
yĕṭṭa nĕduḍa nā moha mĕṁta sesī nannunu