Maṟasi vooragumdide manase kaṟagubadu

మఱచి వూరకుండితే మనసే కఱకుపడు
Language

(॥పల్లవి॥)
మఱచి వూరకుండితే మనసే కఱకుపడు
యెఱుకఁ దలపెట్టితే నీడేరుఁ బనులు

(॥॥)
మొగములు చూడఁగాను మోములు గడుఁబుట్టు
నగఁగానే పాయరానిననుపు లౌను
తగిలి మాటలాడఁగా తమకము లుప్పతిల్లు
బగివాయ కెప్పుడూఁ బతివద్ద నుండవే

(॥॥)
చేరి జూజాలాడఁగానే చిమ్మిరేఁగు వేడుకలు
సారే సన్నలు సేయఁగ చవులు వుట్టు
నేరుపుతోఁ జెనకఁగా నిండుకొను మచ్చికలు
వూరికే యాతనివద్ద నూడిగాలు సేయవే

(॥॥)
కందువఁ బాదాలొత్తఁగా కాగిళ్లు సమకూడు
అంది విడెమియ్యఁగానే ఆసలు మించు
చెందె నిన్ను నింతలోనే శ్రీ వేంకటేశ్వరుఁడు
ముందుగా నింపులతోడ మోవితేనె లియ్యవే

(||pallavi||)
maṟasi vūraguṁḍide manase kaṟagubaḍu
yĕṟugam̐ dalabĕṭṭide nīḍerum̐ banulu

(||||)
mŏgamulu sūḍam̐gānu momulu gaḍum̐buṭṭu
nagam̐gāne pāyarāninanubu launu
tagili māḍalāḍam̐gā tamagamu luppadillu
bagivāya kĕppuḍūm̐ badivadda nuṁḍave

(||||)
seri jūjālāḍam̐gāne simmirem̐gu veḍugalu
sāre sannalu seyam̐ga savulu vuṭṭu
nerubudom̐ jĕnagam̐gā niṁḍugŏnu machchigalu
vūrige yādanivadda nūḍigālu seyave

(||||)
kaṁduvam̐ bādālŏttam̐gā kāgiḽlu samagūḍu
aṁdi viḍĕmiyyam̐gāne āsalu miṁchu
sĕṁdĕ ninnu niṁtalone śhrī veṁkaḍeśhvarum̐ḍu
muṁdugā niṁpuladoḍa movidenĕ liyyave