మఱచేమా నేమిఁక మాఁటిమాఁటికి
(॥పల్లవి॥)
మఱచేమా నేమిఁక మాఁటిమాఁటికి
తఱితోడ నేపొద్దు ధ్యానము సేసేము
(॥మఱ॥)
ఆపె గరుడిఁ జదివినటు వంటిమాఁటలు
రాపుల నిదివో నేఁడు రచ్చకెక్కెను
పై పై నే మవియెల్లా పాటము గొంటిమి నేఁడు
చాపలాన నేపొద్దూ జపము సేసేవు
(॥మఱ॥)
పడఁతి మొగసాలలోఁ బచరించినచేఁతలు
వడిగాఁగ నిన్నిట్లాను వహికెక్కెను
విడివిగా నేమవి నేరుచుకొంటి మిదివో
తడఁబడ కేపొద్దూఁ దలఁచుకొనేము
(॥మఱ॥)
అంగనమంచముమీఁద నభ్యసించినవిద్యలు
రంగుగా మాకాఁగిటిలో రతికెక్కెను
అంగవించి శ్రీవేంకటాధిప నన్నే కూడితి
సింగారాలనీరూపే చింతనసేసేము
(||pallavi||)
maṟasemā nemim̐ka mām̐ṭimām̐ṭigi
taṟidoḍa nebŏddu dhyānamu sesemu
(||maṟa||)
ābĕ garuḍim̐ jadivinaḍu vaṁṭimām̐ṭalu
rābula nidivo nem̐ḍu rachchagĕkkĕnu
pai pai ne maviyĕllā pāḍamu gŏṁṭimi nem̐ḍu
sābalāna nebŏddū jabamu sesevu
(||maṟa||)
paḍam̐ti mŏgasālalom̐ basariṁchinasem̐talu
vaḍigām̐ga ninniṭlānu vahigĕkkĕnu
viḍivigā nemavi nerusugŏṁṭi midivo
taḍam̐baḍa kebŏddūm̐ dalam̐sugŏnemu
(||maṟa||)
aṁganamaṁchamumīm̐da nabhyasiṁchinavidyalu
raṁgugā māgām̐giḍilo radigĕkkĕnu
aṁgaviṁchi śhrīveṁkaḍādhiba nanne kūḍidi
siṁgārālanīrūbe siṁtanasesemu