మఱఁగులు వెట్టకువే మాతో నీవు
(॥పల్లవి॥)
మఱఁగులు వెట్టకువే మాతో నీవు
యెఱఁగ వచ్చిన పనికేల దాఁచేవే
(॥మఱఁ॥)
సెలవుల నవ్వులనే సిగ్గులు వెల్లివిరిసె
పులకల వలపులు పొడచూపెను
చెలప చెమటలనే చిత్తపుకరఁగు చూపె
తలఁపులో భావ మిఁక దాఁచ నేఁటికే
(॥మఱఁ॥)
కన్నుల తేటలలోనే కానవచ్చె వేడుకలు
తిన్నని నిట్టూరుపులఁ దెలిసెఁ దమి
పన్నిన నివ్వెరగులఁ బచ్చిదేరేఁ గోరికలు
యిన్నిటా నీభావ మిఁకనేల దాఁచేవే
(॥మఱఁ॥)
వెడజారుఁ దురుమున వెలసె నీ కూటములు
తొడరి మోముకళల దొట్టె ననుపు
అడరి శ్రీవేంకటేశుఁ డలమేల్మంగ నిన్నేలె
యెడయని నీ భావము యేల దాఁచేవే
(||pallavi||)
maṟam̐gulu vĕṭṭaguve mādo nīvu
yĕṟam̐ga vachchina panigela dām̐seve
(||maṟam̐||)
sĕlavula navvulane siggulu vĕllivirisĕ
pulagala valabulu pŏḍasūbĕnu
sĕlaba sĕmaḍalane sittabugaram̐gu sūbĕ
talam̐pulo bhāva mim̐ka dām̐sa nem̐ṭige
(||maṟam̐||)
kannula teḍalalone kānavachchĕ veḍugalu
tinnani niṭṭūrubulam̐ dĕlisĕm̐ dami
pannina nivvĕragulam̐ bachchiderem̐ gorigalu
yinniḍā nībhāva mim̐kanela dām̐seve
(||maṟam̐||)
vĕḍajārum̐ durumuna vĕlasĕ nī kūḍamulu
tŏḍari momugaḽala dŏṭṭĕ nanubu
aḍari śhrīveṁkaḍeśhum̐ ḍalamelmaṁga ninnelĕ
yĕḍayani nī bhāvamu yela dām̐seve