Maṟamgulemti kimtada mannimchavayyaa

మఱఁగులేఁటి కింతట మన్నించవయ్యా
Language

(॥పల్లవి॥)
మఱఁగులేఁటి కింతట మన్నించవయ్యా
చిఱుత నీ సేసలు చిత్తగించవయ్యా

(॥॥)
మచ్చువేసి మాటలాడి మగువను వలపించి
రచ్చలఁ బెట్టితి వింక రావయ్యా
యిచ్చకములే సేసి యీవిగా మోవి యొసఁగి
లచ్చనలు నించితి వెల్లవారు నెరిఁగిరి

(॥॥)
నయగారాలెల్లాఁ జూపి నంటున నవ్వులు నవ్వి
దయతోఁ బెండ్లాడితివి తలఁచవయ్యా
ప్రియములు పచరించి బిగువుఁజన్నులు ముట్టి
క్రియలు మరిపి సిగ్గు బయలుసేసితివి

(॥॥)
చూపులనే యాసరేఁచి సొమ్ములు మేనఁ బెట్టి
తీపులనే కూడితివి తెలియవయ్యా
యేపున శ్రీ వేంకటేశ యిన్నిటా నేర్పరిఁ జేసి
చేపట్టితి విందుకు నీచెలులు మెచ్చేరు

(||pallavi||)
maṟam̐gulem̐ṭi kiṁtaḍa manniṁchavayyā
siṟuda nī sesalu sittagiṁchavayyā

(||||)
machchuvesi māḍalāḍi maguvanu valabiṁchi
rachchalam̐ bĕṭṭidi viṁka rāvayyā
yichchagamule sesi yīvigā movi yŏsam̐gi
lachchanalu niṁchidi vĕllavāru nĕrim̐giri

(||||)
nayagārālĕllām̐ jūbi naṁṭuna navvulu navvi
dayadom̐ bĕṁḍlāḍidivi talam̐savayyā
priyamulu pasariṁchi biguvum̐jannulu muṭṭi
kriyalu maribi siggu bayalusesidivi

(||||)
sūbulane yāsarem̐si sŏmmulu menam̐ bĕṭṭi
tībulane kūḍidivi tĕliyavayyā
yebuna śhrī veṁkaḍeśha yinniḍā nerbarim̐ jesi
sebaṭṭidi viṁdugu nīsĕlulu mĕchcheru