Maramgula maadalela maabu daamkaanu

మరఁగుల మాటలేల మాపు దాఁకాను
Language

(॥పల్లవి॥)
మరఁగుల మాటలేల మాపు దాఁకాను
అరిమురి వేడుకతో నానతి యిమ్మనవే

(॥మరఁ॥)
చిత్తము వచ్చితేఁజాలుఁ జేసే నేనియైనా
యిత్తలనాతో నాన తిమ్మనవే
బత్తి సేసేదాన నింతే పైపైఁ దనకేల కొంక
హత్తించే నెవ్వతెనైనా నానతి యిమ్మనవే

(॥మరఁ॥)
పంత మీడేరితేఁజాలు భామల నొడఁబరచేఁ
నింతయు నాతో నాన తిమ్మనవే
వింతదాననా నేను విచారము మరియాల
అంతరంగమైనపొందు లానతి యిమ్మనవే

(॥మరఁ॥)
సమ్మతియైతేఁజాలు చాయలోనే మేలఁగేను
ఇమ్ముల నింపేన దానతిమ్మనవే
వుమ్మడి శ్రీవేంకటేశుఁ డొనరెఁ దా నాకాఁగిట
అమ్మలాల తనసుద్దు లానతి యిమ్మనవే

(||pallavi||)
maram̐gula māḍalela mābu dām̐kānu
arimuri veḍugado nānadi yimmanave

(||maram̐||)
sittamu vachchidem̐jālum̐ jese neniyainā
yittalanādo nāna timmanave
batti sesedāna niṁte paibaim̐ danagela kŏṁka
hattiṁche nĕvvadĕnainā nānadi yimmanave

(||maram̐||)
paṁta mīḍeridem̐jālu bhāmala nŏḍam̐barasem̐
niṁtayu nādo nāna timmanave
viṁtadānanā nenu visāramu mariyāla
aṁtaraṁgamainabŏṁdu lānadi yimmanave

(||maram̐||)
sammadiyaidem̐jālu sāyalone melam̐genu
immula niṁpena dānadimmanave
vummaḍi śhrīveṁkaḍeśhum̐ ḍŏnarĕm̐ dā nāgām̐giḍa
ammalāla tanasuddu lānadi yimmanave