Maṟamdi yanusu dharmajumdu bhramasunada

మఱఁది యనుచు ధర్మజుఁడు భ్రమసునట
Language

(॥పల్లవి॥)
మఱఁది యనుచు ధర్మజుఁడు భ్రమసునట
యెఱుకతోడి వివేక మెవ్వరియందున్నది

(॥మఱఁది॥)
గరుడవాహన మెక్కి ఘనబాణుని నరికి
తిరిగినా నమ్మరైరి దేవుఁడవని
నరకాసురునిఁజంపి నాతులఁ బదారువేల
వెరసి పెండ్లాడినది వివేకించరైరి

(॥మఱఁది॥)
బలుశంఖచక్రములు పట్టి బాలకులఁ దెచ్చి
తెలిపినా నమ్మరైరి దేవుఁడవని
సొలసి విశ్వరూపము చూపి అగ్రపూజగొని
వెలయ నీ మహిమలు వివేకించరైరి

(॥మఱఁది॥)
పక్కన ద్రౌపదిఁ గాచి బ్రహ్మచే మొక్కించుకొని
దిక్కైనా నమ్మరైరి దేవుఁడవని
దక్కి శ్రీ వేంకటేశ యిందరికి వరము లిచ్చి
వెక్కస మైతివి నాఁడు వివేకించరైరి

(||pallavi||)
maṟam̐di yanusu dharmajum̐ḍu bhramasunaḍa
yĕṟugadoḍi vivega mĕvvariyaṁdunnadi

(||maṟam̐di||)
garuḍavāhana mĕkki ghanabāṇuni narigi
tiriginā nammarairi devum̐ḍavani
naragāsurunim̐jaṁpi nādulam̐ badāruvela
vĕrasi pĕṁḍlāḍinadi vivegiṁcharairi

(||maṟam̐di||)
baluśhaṁkhasakramulu paṭṭi bālagulam̐ dĕchchi
tĕlibinā nammarairi devum̐ḍavani
sŏlasi viśhvarūbamu sūbi agrabūjagŏni
vĕlaya nī mahimalu vivegiṁcharairi

(||maṟam̐di||)
pakkana draubadim̐ gāsi brahmase mŏkkiṁchugŏni
dikkainā nammarairi devum̐ḍavani
dakki śhrī veṁkaḍeśha yiṁdarigi varamu lichchi
vĕkkasa maidivi nām̐ḍu vivegiṁcharairi