Maragimchidi vaadani maayalambetti

మరగించితి వాతని మాయలఁబెట్టి
Language

(॥పల్లవి॥)
మరగించితి వాతని మాయలఁబెట్టి
యిరవుగా నేఁ జేకొంటి నిఁక నేమిసేసేవే

(॥మరి॥)
ఆకుమడిచి యిచ్చితి వాతనికి వద్దనుండి
యేకతములాడితివి యింటిలోనను
చేకొని నీయాతుమార సేవలెల్లాఁ జేసితివి
యీకడ నీయాసోద మింకా నెంతగలదే

(॥మరి॥)
లలి నీ వాతనితమ్ములము వెట్టించుకొంటివి
సలిగెతనాల నివె జట్టిగొంటివి
కొలువు లేపొద్దూఁ జేసుకొంటా నిట్టె వుందానవు
యెలమి నీయాసోద మింకా నెంతగలదే

(॥మరి॥)
పచ్చడములో చొచ్చుక పతి నెలయించితివి
విచ్చనవిడి నిందాఁకా వెలసితివి
యిచ్చట శ్రీవేంకటేశుఁ డింతలోనె నన్ను నేలె
హెచ్చితి నీయాసోద మింకా నెంతగలదే

(||pallavi||)
maragiṁchidi vādani māyalam̐bĕṭṭi
yiravugā nem̐ jegŏṁṭi nim̐ka nemiseseve

(||mari||)
āgumaḍisi yichchidi vādanigi vaddanuṁḍi
yegadamulāḍidivi yiṁṭilonanu
segŏni nīyādumāra sevalĕllām̐ jesidivi
yīgaḍa nīyāsoda miṁkā nĕṁtagalade

(||mari||)
lali nī vādanidammulamu vĕṭṭiṁchugŏṁṭivi
saligĕdanāla nivĕ jaṭṭigŏṁṭivi
kŏluvu lebŏddūm̐ jesugŏṁṭā niṭṭĕ vuṁdānavu
yĕlami nīyāsoda miṁkā nĕṁtagalade

(||mari||)
pachchaḍamulo sŏchchuga padi nĕlayiṁchidivi
vichchanaviḍi niṁdām̐kā vĕlasidivi
yichchaḍa śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalonĕ nannu nelĕ
hĕchchidi nīyāsoda miṁkā nĕṁtagalade