మనోభావకుఁడవు మగువ మిక్కిలి జాణ
(॥పల్లవి॥)
మనోభావకుఁడవు మగువ మిక్కిలి జాణ
అనేక విన్నపము లందులోనే వున్నవి
(॥మనో॥)
వంచినరెప్పలవెంట వడిసిన కన్నీరు
కొంచక నీమీఁదఁ జెలి గోరఁ జిమ్మీని
యెంచి నీ విందాఁక రాక యింత నేసినయందుకు
పొంచి నీకు నక్కునఁ బోసి చూప వలదా
(॥మనో॥)
సారె నాకొప్పువిరులు సరి నొక్కొక్కటే తీసి
దార దప్ప కుండ నిన్నుఁ దాఁక వేసీని
రా రమ్మనీ పిలువఁ బరా కై వుండినందుకు
వూర కుండి తనపాటు వొప్పగించ వలదా
(॥మనో॥)
వెట్టఁ బొరలిన దై వెస నిన్నుఁ గాఁగిలించె
అట్టె తన అసురుసు రదె చూపీని
ఱట్టుగ శ్రీవెంకటేశ నెట్టనఁ గూడి తీడనె
దిట్టయి నీసేసినమేలు దిగఁ బోయ వలదా
(||pallavi||)
manobhāvagum̐ḍavu maguva mikkili jāṇa
anega vinnabamu laṁdulone vunnavi
(||mano||)
vaṁchinarĕppalavĕṁṭa vaḍisina kannīru
kŏṁchaga nīmīm̐dam̐ jĕli goram̐ jimmīni
yĕṁchi nī viṁdām̐ka rāga yiṁta nesinayaṁdugu
pŏṁchi nīgu nakkunam̐ bosi sūba valadā
(||mano||)
sārĕ nāgŏppuvirulu sari nŏkkŏkkaḍe tīsi
dāra dappa kuṁḍa ninnum̐ dām̐ka vesīni
rā rammanī piluvam̐ barā kai vuṁḍinaṁdugu
vūra kuṁḍi tanabāḍu vŏppagiṁcha valadā
(||mano||)
vĕṭṭam̐ bŏralina dai vĕsa ninnum̐ gām̐giliṁchĕ
aṭṭĕ tana asurusu radĕ sūbīni
ṟaṭṭuga śhrīvĕṁkaḍeśha nĕṭṭanam̐ gūḍi tīḍanĕ
diṭṭayi nīsesinamelu digam̐ boya valadā