మన్నించు నే నిలుచుండే మఱి కొలువుసేసేను
(॥పల్లవి॥)
మన్నించు నే నిలుచుండే మఱి కొలువుసేసేను
ఇన్నేసి మాటలాడ నీ యీడువారమా
(॥మన్నిం॥)
అరసి నే నలిగితినంటా వేఁడుకొనేవు
సరికి బేసికి నీతో సాటివారమా
పరగనట్టే మంచముపైకిఁ దీసుకొనేవు
సరుసఁ గూచుండ నీతో సరివారమా
(॥మన్నిం॥)
వొట్టు వెట్టుకొంటినంటా నొడివట్టి తీసేవు
అట్టే మారువెనఁగ వియ్యపువారమా
చుట్టిరికములు సేసి సుద్దులెల్లఁ జెప్పేవు
నెట్టుకొని వూఁకొను నీయంతవారమా
(॥మన్నిం॥)
పంతములాడితినంటా పక్కనఁ గాఁగిలించేవు
కాంతుఁడవు నేము నీకు కడవారమా
రంతుల శ్రీవేంకటేశ రతుల మేమ్మలితివి
దొంతరమెచ్చులు మెచ్చ దొడ్డవారమా
(||pallavi||)
manniṁchu ne nilusuṁḍe maṟi kŏluvusesenu
innesi māḍalāḍa nī yīḍuvāramā
(||manniṁ||)
arasi ne naligidinaṁṭā vem̐ḍugŏnevu
sarigi besigi nīdo sāḍivāramā
paraganaṭṭe maṁchamubaigim̐ dīsugŏnevu
sarusam̐ gūsuṁḍa nīdo sarivāramā
(||manniṁ||)
vŏṭṭu vĕṭṭugŏṁṭinaṁṭā nŏḍivaṭṭi tīsevu
aṭṭe māruvĕnam̐ga viyyabuvāramā
suṭṭirigamulu sesi suddulĕllam̐ jĕppevu
nĕṭṭugŏni vūm̐kŏnu nīyaṁtavāramā
(||manniṁ||)
paṁtamulāḍidinaṁṭā pakkanam̐ gām̐giliṁchevu
kāṁtum̐ḍavu nemu nīgu kaḍavāramā
raṁtula śhrīveṁkaḍeśha radula memmalidivi
dŏṁtaramĕchchulu mĕchcha dŏḍḍavāramā