మన్నించు మా మాటలు మగువను దయనేలు
(॥పల్లవి॥)
మన్నించు మా మాటలు మగువను దయనేలు
సన్నల రాఁపుసేయకు జవరాలిని
(॥మన్నిం॥)
చలపట్టి యెంచరాదు సడిఁబెట్టఁగారాదు
చెలరేఁగి కడుమోహించినకాంతను
అలఇంపించఁగవద్దు ఆస చెరుచఁదగదు
పిలువకే వచ్చిన ప్రియురాలిని
(॥మన్నిం॥)
చిమ్మిరేఁచఁ బాడిగాదు సిగ్గువరచ దోసము
సమ్మతించి కాచుకున్న జలజాక్షిని
పమ్మి నవ్వనీదగదు పైకొనకుండు టొచ్చము
నెమ్మది సరసమాడే నేరుపరిసతిని
(॥మన్నిం॥)
బాసియ్య నది నేరమి పరాకుసేయుట నీతి
సేసవెట్టి కూడిన మచ్చిక సతిని
వాసితో వేంకటేశ వడి నలమేల్మంగను
తాసువలెఁ గూడితివి తగిన యీయింతిని
(||pallavi||)
manniṁchu mā māḍalu maguvanu dayanelu
sannala rām̐puseyagu javarālini
(||manniṁ||)
salabaṭṭi yĕṁcharādu saḍim̐bĕṭṭam̐gārādu
sĕlarem̐gi kaḍumohiṁchinagāṁtanu
ala̮iṁpiṁcham̐gavaddu āsa sĕrusam̐dagadu
piluvage vachchina priyurālini
(||manniṁ||)
simmirem̐sam̐ bāḍigādu sigguvarasa dosamu
sammadiṁchi kāsugunna jalajākṣhini
pammi navvanīdagadu paigŏnaguṁḍu ṭŏchchamu
nĕmmadi sarasamāḍe nerubarisadini
(||manniṁ||)
bāsiyya nadi nerami parāguseyuḍa nīdi
sesavĕṭṭi kūḍina machchiga sadini
vāsido veṁkaḍeśha vaḍi nalamelmaṁganu
tāsuvalĕm̐ gūḍidivi tagina yīyiṁtini