మన్నించీఁ బదారువేల మగఁడు తాను
(॥పల్లవి॥)
మన్నించీఁ బదారువేల మగఁడు తాను
నిన్ననేఁటి పడుచను నేనేమి బాఁతే
(॥మన్నిం॥)
చెక్కు నొక్కి బుజ్జగించి చేతిమీఁదఁ జేయివేసి
యిక్కువ లంటీ నేఁదన కేమిబాఁతే
చక్కనిదాననంటా జవ్వనపుదాననంటా
నెక్కొని పొగడీ నిదే నే నేమిఁబాఁతే
(॥మన్ని॥)
పచ్చిదేర మాఁటలాడి పాపట దువ్వి దువ్వి
యిచ్చె వీడెము నాకు నే నేమిబాఁతే
యిచ్చకముదాననంటా నితవరిదాననంటాఁ
నిచ్చలు నన్నుఁబాయఁడు నే నేమిబాఁతే
(॥మన్ని॥)
చుట్టరికములు చెప్పి సొమ్ములెల్లా నాకుఁబెట్టి
యిట్టె నన్నుఁగూడీ నే నేమిబాఁతే
ముట్టి శ్రీవేంకటేశుఁడిమ్ముల మేలుదాననంటా
నెట్టన నన్నుఁబెండ్లాడీ నే నేమిబాఁతే
(||pallavi||)
manniṁchīm̐ badāruvela magam̐ḍu tānu
ninnanem̐ṭi paḍusanu nenemi bām̐te
(||manniṁ||)
sĕkku nŏkki bujjagiṁchi sedimīm̐dam̐ jeyivesi
yikkuva laṁṭī nem̐dana kemibām̐te
sakkanidānanaṁṭā javvanabudānanaṁṭā
nĕkkŏni pŏgaḍī nide ne nemim̐bām̐te
(||manni||)
pachchidera mām̐ṭalāḍi pābaḍa duvvi duvvi
yichchĕ vīḍĕmu nāgu ne nemibām̐te
yichchagamudānanaṁṭā nidavaridānanaṁṭām̐
nichchalu nannum̐bāyam̐ḍu ne nemibām̐te
(||manni||)
suṭṭarigamulu sĕppi sŏmmulĕllā nāgum̐bĕṭṭi
yiṭṭĕ nannum̐gūḍī ne nemibām̐te
muṭṭi śhrīveṁkaḍeśhum̐ḍimmula meludānanaṁṭā
nĕṭṭana nannum̐bĕṁḍlāḍī ne nemibām̐te