మన్నించవోయి మమ్ము మంచివాఁడ
(॥పల్లవి॥)
మన్నించవోయి మమ్ము మంచివాఁడ
విన్నపము వినవోయి వేడుకకాఁడ
(॥మన్నిం॥)
ఆసలు మాకుఁజూపి అంగముపైఁ జేయివేసి
వాసులు రేఁచకువోయి వన్నెకాఁడ
బాసికము గట్టితివి పైసేస వెట్టితివి
నీసటల కోవుదునా నీటుకాఁడా
(॥మన్నిం॥)
సన్నలు మాకు జేసి చవులుగా మాటలాడి
పన్నకువోయి మాయలు పసకాఁడ
కన్నులనే నవ్వితివి కందువలు చూపితివి
యిన్నియు నీ వెఱగవా యేతులకాడా
(॥మన్నిం॥)
మరిగించి మమ్ము నీవు మంతనాన బాయకుండి
యెరవు సేయకువోయి యింపులకాఁడ
కరుణంచితివి శ్రీవేంకటరాయ కూడితివి
సరవి నడపవోయి చాయలకాడా
(||pallavi||)
manniṁchavoyi mammu maṁchivām̐ḍa
vinnabamu vinavoyi veḍugagām̐ḍa
(||manniṁ||)
āsalu māgum̐jūbi aṁgamubaim̐ jeyivesi
vāsulu rem̐saguvoyi vannĕgām̐ḍa
bāsigamu gaṭṭidivi paisesa vĕṭṭidivi
nīsaḍala kovudunā nīḍugām̐ḍā
(||manniṁ||)
sannalu māgu jesi savulugā māḍalāḍi
pannaguvoyi māyalu pasagām̐ḍa
kannulane navvidivi kaṁduvalu sūbidivi
yinniyu nī vĕṟagavā yedulagāḍā
(||manniṁ||)
marigiṁchi mammu nīvu maṁtanāna bāyaguṁḍi
yĕravu seyaguvoyi yiṁpulagām̐ḍa
karuṇaṁchidivi śhrīveṁkaḍarāya kūḍidivi
saravi naḍabavoyi sāyalagāḍā