Mannimchavayyaa yeemaguva nitte

మన్నించవయ్యా యీమగువ నిట్టె
Language

(॥పల్లవి॥)
మన్నించవయ్యా యీమగువ నిట్టె
విన్నపము విని నీవే విడెమియ్యవయ్యా

(॥మన్నిం॥)
మచ్చికసేసి యాపె మాట నీతో నాడఁగాను
యెచ్చోటు చూచేవు పరా కేడదయ్యా
పచ్చిచెమటలతోడ పాదాలు నీకు గుద్దఁగ
వచ్చునా నాకు నిద్దుర వట్టిసట లేలయ్యా

(॥మన్నిం॥)
నంటుసేసి యప్పటిని నవ్వులెల్ల నవ్వఁగాను
గొంటవై వున్నాఁడవు యీగుణ మేలయ్యా
చంటిమొన సోఁకఁగ వింజామర నీకు వేయఁగ
వొంటి నీసిగ్గు దగునా వొగి మాయలేలయ్యా

(॥మన్నిం॥)
కందునకుఁ దీసి యాపె కాఁగిటికి రమ్మనఁగ
యెందరితో సన్న సేసే వెమ్మెలకయ్యా
చెంది శ్రీవేంకటేశుఁడ సేస లాపె చల్లఁగాను
మందలించి మారుకుమారు చల్లే వౌనయ్యా

(||pallavi||)
manniṁchavayyā yīmaguva niṭṭĕ
vinnabamu vini nīve viḍĕmiyyavayyā

(||manniṁ||)
machchigasesi yābĕ māḍa nīdo nāḍam̐gānu
yĕchchoḍu sūsevu parā keḍadayyā
pachchisĕmaḍaladoḍa pādālu nīgu guddam̐ga
vachchunā nāgu niddura vaṭṭisaḍa lelayyā

(||manniṁ||)
naṁṭusesi yappaḍini navvulĕlla navvam̐gānu
gŏṁṭavai vunnām̐ḍavu yīguṇa melayyā
saṁṭimŏna som̐kam̐ga viṁjāmara nīgu veyam̐ga
vŏṁṭi nīsiggu dagunā vŏgi māyalelayyā

(||manniṁ||)
kaṁdunagum̐ dīsi yābĕ kām̐giḍigi rammanam̐ga
yĕṁdarido sanna sese vĕmmĕlagayyā
sĕṁdi śhrīveṁkaḍeśhum̐ḍa sesa lābĕ sallam̐gānu
maṁdaliṁchi mārugumāru salle vaunayyā