Mannimchavayyaa yee maguvanu nem ditte

మన్నించవయ్యా యీ మగువను నేఁ డిట్టే
Language

(॥పల్లవి॥)
మన్నించవయ్యా యీ మగువను నేఁ డిట్టే
సన్నల చాయల నిన్ను సాదించే(చీ?)నా

(॥మన్ని॥)
అడ్డము చెప్పఁగరాదు అవుఁగాదనరాదు నిన్ను
వొడ్డారపు మాటలకు నోపునా యీకె
యెడ్డఁడవు గావు చూడ యిన్నిటాను జాణఁడవు
దొడ్డివారివలె నిన్ను దూఱఁగలదా

(॥మన్ని॥)
కోపగించరాదు నీతో గుంపించి అలుగరాదు
తాపపు విరహనకు తగునా యీకె
తోపునూకుడు సేయవు దొరవు ఇన్నిటా నీవు
చాపలపు వారివలె జరయఁగఁ గలదా

(॥మన్ని॥)
కక్కసించరాదు నిన్ను కరకరిఁ బెట్టరాదు
నెక్కొన్న నీతో చలము నేర్చునా యీకె
చెక్కు నొక్కి కూడితివి శ్రీ వేంకటేశ్వరుఁడవు
తక్కినవారివలెఁ బంతములాడఁ గలదా

(||pallavi||)
manniṁchavayyā yī maguvanu nem̐ ḍiṭṭe
sannala sāyala ninnu sādiṁche(sī?)nā

(||manni||)
aḍḍamu sĕppam̐garādu avum̐gādanarādu ninnu
vŏḍḍārabu māḍalagu nobunā yīgĕ
yĕḍḍam̐ḍavu gāvu sūḍa yinniḍānu jāṇam̐ḍavu
dŏḍḍivārivalĕ ninnu dūṟam̐galadā

(||manni||)
kobagiṁcharādu nīdo guṁpiṁchi alugarādu
tābabu virahanagu tagunā yīgĕ
tobunūguḍu seyavu dŏravu inniḍā nīvu
sābalabu vārivalĕ jarayam̐gam̐ galadā

(||manni||)
kakkasiṁcharādu ninnu karagarim̐ bĕṭṭarādu
nĕkkŏnna nīdo salamu nersunā yīgĕ
sĕkku nŏkki kūḍidivi śhrī veṁkaḍeśhvarum̐ḍavu
takkinavārivalĕm̐ baṁtamulāḍam̐ galadā