మన్నించవయ్యా ఇఁక మానినికి నీవె దిక్కు
(॥పల్లవి॥)
మన్నించవయ్యా ఇఁక మానినికి నీవె దిక్కు
పన్నిన వలపే నీకు పాయరాని చుట్టము
(॥మన్నించ॥)
చెంతఁ జెక్కునఁ బెట్టినచేతితోడ నుండఁగాను
దొంతరతామెర ఆయఁ దొయ్యలిమోము
మంతనానఁ జూచితేను మనసిజబాణమది
అంతరంగానఁ దగులకది యేల వుండును
(॥మన్నించి॥)
వొండొండఁ జన్నులు మోవనొత్తగిలి వుండఁగాను
అండ జంట బాణమాయ నతివమేను
వెండియు మరునికే విరులబంతులవి
దండితనాన నీమదిఁ దగులఁగవలదా
(॥మన్నించ॥)
విందుగాఁ దమ్ములములు వీడుదోడులాడఁగాను
అంది చిగురుఁగుత్తులాయఁ జెలిమోవి
చెంది మరుఁడు సేసిన చిగురుఁగానుకలవి
కందువ శ్రీ వేంకటేశ కడుఁబొదులు గావా
(||pallavi||)
manniṁchavayyā im̐ka māninigi nīvĕ dikku
pannina valabe nīgu pāyarāni suṭṭamu
(||manniṁcha||)
sĕṁtam̐ jĕkkunam̐ bĕṭṭinasedidoḍa nuṁḍam̐gānu
dŏṁtaradāmĕra āyam̐ dŏyyalimomu
maṁtanānam̐ jūsidenu manasijabāṇamadi
aṁtaraṁgānam̐ dagulagadi yela vuṁḍunu
(||manniṁchi||)
vŏṁḍŏṁḍam̐ jannulu movanŏttagili vuṁḍam̐gānu
aṁḍa jaṁṭa bāṇamāya nadivamenu
vĕṁḍiyu marunige virulabaṁtulavi
daṁḍidanāna nīmadim̐ dagulam̐gavaladā
(||manniṁcha||)
viṁdugām̐ dammulamulu vīḍudoḍulāḍam̐gānu
aṁdi sigurum̐guttulāyam̐ jĕlimovi
sĕṁdi marum̐ḍu sesina sigurum̐gānugalavi
kaṁduva śhrī veṁkaḍeśha kaḍum̐bŏdulu gāvā