(॥పల్లవి॥)
మనవి చెప్పితిని మఱవకుమీ
కనుఁగొని నామాఁట కడువకుమీ
(॥మనవి॥)
యిచ్చక మాడితి వీడనె వుంటవి
మచ్చిక నా మేలు మఱవకుమీ
వచ్చి వేకేరొకతె వలపులు చల్లిన
పచ్చిదేరి మరి పదరకుమీ
(॥మనవి॥)
సరస మాడితివి చనవు లిచ్చితిని
మరిగిననాపొందు మానకుమీ
సరిగా మరొకతె సందులు దూరిన
తొరలి యపుడు మరి తొలఁచకుమీ
(॥మనవి॥)
కలసితి విప్పుడు కాఁగిలించితివి
పొలసి యిట్లనె భోగించుమీ
యెలమిని శ్రీవెంకటేశ్వర మరొకతె
పిలిచితేను మరి పెనఁగకుమీ
(||pallavi||)
manavi sĕppidini maṟavagumī
kanum̐gŏni nāmām̐ṭa kaḍuvagumī
(||manavi||)
yichchaga māḍidi vīḍanĕ vuṁṭavi
machchiga nā melu maṟavagumī
vachchi vegerŏgadĕ valabulu sallina
pachchideri mari padaragumī
(||manavi||)
sarasa māḍidivi sanavu lichchidini
mariginanābŏṁdu mānagumī
sarigā marŏgadĕ saṁdulu dūrina
tŏrali yabuḍu mari tŏlam̐sagumī
(||manavi||)
kalasidi vippuḍu kām̐giliṁchidivi
pŏlasi yiṭlanĕ bhogiṁchumī
yĕlamini śhrīvĕṁkaḍeśhvara marŏgadĕ
pilisidenu mari pĕnam̐gagumī