Manavaare yamdarunu madi nemchi soosidenu

మనవారే యందరును మతి నెంచి చూచితేను
Language

(॥పల్లవి॥)
మనవారే యందరును మతి నెంచి చూచితేను
పెనగొన్న సంతోసాలే బెరసీ మీకిఁకను

(॥మన॥)
చిత్త పౌఁజులే కావా చిలుకలుఁ గోవిలలు
కొత్తవారంటానేల కొంకేవే నీవు
మత్తిలి కొసరితే నీమాఁట పలుకులో నివి
హత్తి వుండవలెఁగాక యట్టె దూర నేఁటికే

(॥మన॥)
వసంతుని చుట్టాలే కావా తుమ్మిద మూఁకలు
మసలక వీఁటినేల మచ్చరించేవే
సొసఁగఁ దలకెత్తుక పూజించఁదగిన వివి
కొసరుచుఁ గోపగించుకొనకువే నీవు

(॥మన॥)
చందురు సిరులే కావా జడిగొన్న వెన్నెలలు
నిందించ నేలే యవి నీమోము సొంపు
అందపు శ్రీవేంకటేశుఁ డంతలోనే నిన్నుఁ గూడె
పొందుసేయవే మేలు పొదలు సరసము

(||pallavi||)
manavāre yaṁdarunu madi nĕṁchi sūsidenu
pĕnagŏnna saṁtosāle bĕrasī mīgim̐kanu

(||mana||)
sitta paum̐jule kāvā silugalum̐ govilalu
kŏttavāraṁṭānela kŏṁkeve nīvu
mattili kŏsaride nīmām̐ṭa palugulo nivi
hatti vuṁḍavalĕm̐gāga yaṭṭĕ dūra nem̐ṭige

(||mana||)
vasaṁtuni suṭṭāle kāvā tummida mūm̐kalu
masalaga vīm̐ṭinela machchariṁcheve
sŏsam̐gam̐ dalagĕttuga pūjiṁcham̐dagina vivi
kŏsarusum̐ gobagiṁchugŏnaguve nīvu

(||mana||)
saṁduru sirule kāvā jaḍigŏnna vĕnnĕlalu
niṁdiṁcha nele yavi nīmomu sŏṁpu
aṁdabu śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalone ninnum̐ gūḍĕ
pŏṁduseyave melu pŏdalu sarasamu