Manasulu soose madamela

మనసులు చూచే మతమేల
Language

(॥పల్లవి॥)
మనసులు చూచే మతమేల
కొనల చేఁతలకుఁ గొత్తలివేల

(॥మన॥)
నెలఁతవలపులకు నిట్టచూపే గురి
యెలమి మాపలుకు లిఁకనేలా
చిలుకుముదములకు చిఱునవ్వులె గురి
యిలఁ దారుకాణ లిఁకనేలా

(॥మన॥)
చిత్తపుఁగరఁగుకు చిఱుఁజెమటే గురి
యిత్తల ముసగన లిఁకనేల
హత్తినకూర్మికి నండనునికె గురి
పొత్తులబాసలు పూఁచఁగనేలా

(॥మన॥)
కాఁగిటిరతులకు కళలమోమే గుఱి
ఆఁగినయెడమాఁట లివి యేలా
యీగతి శ్రీవేంకటేశ కూడితివి
జాగులసరసపుసట లిఁకనేలా

(||pallavi||)
manasulu sūse madamela
kŏnala sem̐talagum̐ gŏttalivela

(||mana||)
nĕlam̐tavalabulagu niṭṭasūbe guri
yĕlami mābalugu lim̐kanelā
silugumudamulagu siṟunavvulĕ guri
yilam̐ dārugāṇa lim̐kanelā

(||mana||)
sittabum̐garam̐gugu siṟum̐jĕmaḍe guri
yittala musagana lim̐kanela
hattinagūrmigi naṁḍanunigĕ guri
pŏttulabāsalu pūm̐sam̐ganelā

(||mana||)
kām̐giḍiradulagu kaḽalamome guṟi
ām̐ginayĕḍamām̐ṭa livi yelā
yīgadi śhrīveṁkaḍeśha kūḍidivi
jāgulasarasabusaḍa lim̐kanelā