మనసులోనే దేవుఁడున్నవాఁడు మరి వేఁడుకొంటే వరములిచ్చీని
(॥పల్లవి॥)
మనసులోనే దేవుఁడున్నవాఁడు మరి వేఁడుకొంటే వరములిచ్చీని
వినయముతోడ నందరుఁ గూడి విన్నపముచేసి మొక్కరే
(॥మన॥)
కన్నెకు విభుఁడు మేలువాఁడై కదిసి నవ్వఁగఁగ లిగితేను
వెన్నెల ముగ్గులు దొక్కుదమనుచు వెలఁదులాలమొక్కరే
చన్నులమీఁదట నాతనిగోరు సతికి నాఁటించఁగలిగితేను
కొన్ననజాజిమొనలపైఁ దపము కొంకక సేయఁగ మొక్కరే
(॥మన॥)
వెల్లవిరిగా నింతికి విరహవేదన మాని యతఁడు గూడితే
మల్లెలనేపెద్ద కొండాల రఁగ మగువలాల మొక్కరే
బల్లిదుఁ డాతఁడు యాకెతో మాఁటపలుకు లాడఁగలిగితేను
చల్లఁగాఁ గప్రపులప్పల నిట్టె వసంతము లాడఁగ మొక్కరే
(॥మన॥)
మోమెత్తి యాతఁడు రమణిఁ జూచి మోహము చల్లఁగఁగలిగితేను
తామరపూవులఁ బూజసేయఁగ తరుణులాల మొక్కరే
గోమున శ్రీవేంకటేశుఁ డిట్లానే కూడి దోమట్లు గలయఁగలిగితే
భూమిలో తేనెలమోవి దొంతరబోనాలు వోయఁగ మొక్కరే
(||pallavi||)
manasulone devum̐ḍunnavām̐ḍu mari vem̐ḍugŏṁṭe varamulichchīni
vinayamudoḍa naṁdarum̐ gūḍi vinnabamusesi mŏkkare
(||mana||)
kannĕgu vibhum̐ḍu meluvām̐ḍai kadisi navvam̐gam̐ga ligidenu
vĕnnĕla muggulu dŏkkudamanusu vĕlam̐dulālamŏkkare
sannulamīm̐daḍa nādanigoru sadigi nām̐ṭiṁcham̐galigidenu
kŏnnanajājimŏnalabaim̐ dabamu kŏṁkaga seyam̐ga mŏkkare
(||mana||)
vĕllavirigā niṁtigi virahavedana māni yadam̐ḍu gūḍide
mallĕlanebĕdda kŏṁḍāla ram̐ga maguvalāla mŏkkare
ballidum̐ ḍādam̐ḍu yāgĕdo mām̐ṭabalugu lāḍam̐galigidenu
sallam̐gām̐ gaprabulappala niṭṭĕ vasaṁtamu lāḍam̐ga mŏkkare
(||mana||)
momĕtti yādam̐ḍu ramaṇim̐ jūsi mohamu sallam̐gam̐galigidenu
tāmarabūvulam̐ būjaseyam̐ga taruṇulāla mŏkkare
gomuna śhrīveṁkaḍeśhum̐ ḍiṭlāne kūḍi domaṭlu galayam̐galigide
bhūmilo tenĕlamovi dŏṁtarabonālu voyam̐ga mŏkkare