మనసులోఁ దనమేలు మఱవ ననరే మీరు
(॥పల్లవి॥)
మనసులోఁ దనమేలు మఱవ ననరే మీరు
యెనసిన రమణుని కెచ్చరించరే
(॥॥)
కానుక చేకొనెఁగా కవకవ నవ్వుకొంటా
వీనులను విన్నపాలు వినెఁగా తాను
మేను మేను సోఁక నిట్టే మేలములూ నాడెఁగా
ఆనుకొన్నసంతోస మెంతని చెప్పే నిఁకను
(॥॥)
పువ్వుల బంతి యిచ్చెఁగా పొలఁతి నా చేతికి
దవ్వులనుండి వచ్చేఁగా తానే వొద్దికి
నివ్వటిల్ల మోవి తేనియ నాకు నిచ్చెఁగా
యివ్వల నా భాగ్యఫల మీడేరె నిప్పడూ
(॥॥)
చేతులెత్తి నా మీఁద సేసలునుఁ బెట్టేఁగా
కాతరాన నన్నుఁ గూడి కరుణించెఁగా
యీతల శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
యేతుల నాయానంద మిరవాయ నిదివో
(||pallavi||)
manasulom̐ danamelu maṟava nanare mīru
yĕnasina ramaṇuni kĕchchariṁchare
(||||)
kānuga segŏnĕm̐gā kavagava navvugŏṁṭā
vīnulanu vinnabālu vinĕm̐gā tānu
menu menu som̐ka niṭṭe melamulū nāḍĕm̐gā
ānugŏnnasaṁtosa mĕṁtani sĕppe nim̐kanu
(||||)
puvvula baṁti yichchĕm̐gā pŏlam̐ti nā sedigi
davvulanuṁḍi vachchem̐gā tāne vŏddigi
nivvaḍilla movi teniya nāgu nichchĕm̐gā
yivvala nā bhāgyaphala mīḍerĕ nippaḍū
(||||)
sedulĕtti nā mīm̐da sesalunum̐ bĕṭṭem̐gā
kādarāna nannum̐ gūḍi karuṇiṁchĕm̐gā
yīdala śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
yedula nāyānaṁda miravāya nidivo