మనసులో తమకము మాకు నిట్టె కానరాఁగా
(॥పల్లవి॥)
మనసులో తమకము మాకు నిట్టె కానరాఁగా
నను నెంత తేలించేవు నాటకుఁడ నీవు
(॥మన॥)
పువ్వు వంటి జవ్వనము పొద్దొక వింతై రేఁచీ
రవ్వలు సేయక ఇట్టె రావయ్యా నీవు
వువ్విళ్లూరీఁ జెమటలు వూటలై నీమేనను
నవ్వు లేమి నవ్వేవు నాతో నింకా నీవు
(॥మన॥)
కొడిసాగి కోరికలు గుంపులుగా నల్లుకొనె
అడియాసలేల విడె మందియ్యవయ్యా
కడఁగి నివ్వెరగులు కానవచ్చె నీవల్ల
వొడి యాల పట్టి పాడే వూరకే నీవు
(॥మన॥)
చిమ్మిరేఁగిన సిగ్గులు చిడుముడి సందడించె
నెమ్మదిఁ గూచుండవయ్యా నీవు నావద్ద
యిమ్ముల శ్రీవేంకటేశ యిట్టె నన్ను నేలితివి
నమ్మిక లె న్నిచ్చేవు నయాననే నీవు
(||pallavi||)
manasulo tamagamu māgu niṭṭĕ kānarām̐gā
nanu nĕṁta teliṁchevu nāḍagum̐ḍa nīvu
(||mana||)
puvvu vaṁṭi javvanamu pŏddŏga viṁtai rem̐sī
ravvalu seyaga iṭṭĕ rāvayyā nīvu
vuvviḽlūrīm̐ jĕmaḍalu vūḍalai nīmenanu
navvu lemi navvevu nādo niṁkā nīvu
(||mana||)
kŏḍisāgi korigalu guṁpulugā nallugŏnĕ
aḍiyāsalela viḍĕ maṁdiyyavayyā
kaḍam̐gi nivvĕragulu kānavachchĕ nīvalla
vŏḍi yāla paṭṭi pāḍe vūrage nīvu
(||mana||)
simmirem̐gina siggulu siḍumuḍi saṁdaḍiṁchĕ
nĕmmadim̐ gūsuṁḍavayyā nīvu nāvadda
yimmula śhrīveṁkaḍeśha yiṭṭĕ nannu nelidivi
nammiga lĕ nnichchevu nayānane nīvu