Manasulo gubbadillee marmamu lellaa

మనసులో గుబ్బతిల్లీ మర్మము లెల్లా
Language

(॥పల్లవి॥)
మనసులో గుబ్బతిల్లీ మర్మము లెల్లా
కొనవేసీ చూపరాదు గురిలేని ఆస

(॥మన॥)
చేరి నీమోము చూచితే సెలవుల నవ్వువచ్చీ
వూరకే తలవంచుక వుండఁగరాదు
ఆరీతి నీవు దొరవు ఆఁటదాన నే నింతే
తారుకాణించఁగరాదు తలఁపులోవలపు

(॥మన॥)
చెవి నీమాటలు వింటే సిగ్గులెల్లాఁ జిమ్మిరేఁచీ
తవిలి పరాకుచేయఁ దగవు గాదు
యివల నీవు మగఁడ విటు నీకు నే నాలను
రవళి నాడుకోరాదు రతులలో సుద్దులు

(॥మన॥)
అంటి కాఁగిలించుకొంటే ఆయములెల్లా గరఁగు
అంటిననాతమకము అణఁచఁజాల
యింటిలోన శ్రీవేంకటేశ నన్ను నేలితివి
వెంట వెంట మాన్పరాదు వేవేలు వేడుకలు

(||pallavi||)
manasulo gubbadillī marmamu lĕllā
kŏnavesī sūbarādu gurileni āsa

(||mana||)
seri nīmomu sūside sĕlavula navvuvachchī
vūrage talavaṁchuga vuṁḍam̐garādu
ārīdi nīvu dŏravu ām̐ṭadāna ne niṁte
tārugāṇiṁcham̐garādu talam̐pulovalabu

(||mana||)
sĕvi nīmāḍalu viṁṭe siggulĕllām̐ jimmirem̐sī
tavili parāguseyam̐ dagavu gādu
yivala nīvu magam̐ḍa viḍu nīgu ne nālanu
ravaḽi nāḍugorādu radulalo suddulu

(||mana||)
aṁṭi kām̐giliṁchugŏṁṭe āyamulĕllā garam̐gu
aṁṭinanādamagamu aṇam̐sam̐jāla
yiṁṭilona śhrīveṁkaḍeśha nannu nelidivi
vĕṁṭa vĕṁṭa mānparādu vevelu veḍugalu