మనసుకుఁ జల్లన నీమక్కువ తలఁపులె
(॥పల్లవి॥)
మనసుకుఁ జల్లన నీమక్కువ తలఁపులె
నను బుజ్జగించకురా నవ్వితేనే చాలును
(॥మన॥)
కన్నులకుఁ జల్లన నీకడుఁ జక్కఁదనమే
పన్నీ రేల చల్లేవు పలుమారును
చన్నులకుఁ జల్లన నీ చాయలకొనగోరే
మన్ననతో గందమేల మాకుఁ బూసే విపుడు
(॥మన॥)
వీనులకుఁ జల్లన నీవింత వింతమాటలే
అనినఁ గప్పురమేల అప్పలించేవు
మేనికిఁ జల్లన నీమీఁదనున్న పచ్చడమే
పూవి విసరించకురా పొంబట్టుసురట్ల
(॥మన॥)
కాఁగిటికిఁ జల్లన నీకాయపు సింగారమే
పాఁగిన పూవులపాన్పు పఱచకురా
దాఁగక శ్రీవేంకటేశ తగ నన్నుఁ గూడితివి
చేఁగదేరఁ గొసరకు చెప్పినట్టే ఆయను
(||pallavi||)
manasugum̐ jallana nīmakkuva talam̐pulĕ
nanu bujjagiṁchagurā navvidene sālunu
(||mana||)
kannulagum̐ jallana nīgaḍum̐ jakkam̐daname
pannī rela sallevu palumārunu
sannulagum̐ jallana nī sāyalagŏnagore
mannanado gaṁdamela māgum̐ būse vibuḍu
(||mana||)
vīnulagum̐ jallana nīviṁta viṁtamāḍale
aninam̐ gappuramela appaliṁchevu
menigim̐ jallana nīmīm̐danunna pachchaḍame
pūvi visariṁchagurā pŏṁbaṭṭusuraṭla
(||mana||)
kām̐giḍigim̐ jallana nīgāyabu siṁgārame
pām̐gina pūvulabānpu paṟasagurā
dām̐gaga śhrīveṁkaḍeśha taga nannum̐ gūḍidivi
sem̐gaderam̐ gŏsaragu sĕppinaṭṭe āyanu