Manasugu manase mari taarugaanavachche

మనసుకు మనసే మరి తారుకాణవచ్చె
Language

(॥పల్లవి॥)
మనసుకు మనసే మరి తారుకాణవచ్చె
చెనకిన చెనకులు చేచేత నున్నవి

(॥మన॥)
వలపులు సరివచ్చె వనిత నిన్ను మెచ్చె
పొలసి యిందాఁకా నాపె పొగడెనయ్యా
కలలు నిక్కములాయ కడుమర్మములు రాయ
కొలువులో నాపెవద్దఁ గూచుండవయ్యా

(॥మన॥)
నవ్వులు సెలవి ముంచె ననుపులు లోలో మించె
మవ్వముతో నిన్ను నాపె మరిగెనయ్యా
జవ్వనము సరిదూఁగె జగడములెల్ల దాఁగె
చివ్వన లోనికిని విచ్చేయవయ్యా

(॥మన॥)
చూపులఁ గళలు నిండె సురతము పంటపండె
వోపిక విన్నాపె నోరూరించెనయ్య
యేపున శ్రీవేంకటేశ యిద్దరుఁ గూడితి రిట్టె
తీపుల నాపె నురము దించుకువయ్యా

(||pallavi||)
manasugu manase mari tārugāṇavachchĕ
sĕnagina sĕnagulu seseda nunnavi

(||mana||)
valabulu sarivachchĕ vanida ninnu mĕchchĕ
pŏlasi yiṁdām̐kā nābĕ pŏgaḍĕnayyā
kalalu nikkamulāya kaḍumarmamulu rāya
kŏluvulo nābĕvaddam̐ gūsuṁḍavayyā

(||mana||)
navvulu sĕlavi muṁchĕ nanubulu lolo miṁchĕ
mavvamudo ninnu nābĕ marigĕnayyā
javvanamu saridūm̐gĕ jagaḍamulĕlla dām̐gĕ
sivvana lonigini vichcheyavayyā

(||mana||)
sūbulam̐ gaḽalu niṁḍĕ suradamu paṁṭabaṁḍĕ
vobiga vinnābĕ norūriṁchĕnayya
yebuna śhrīveṁkaḍeśha yiddarum̐ gūḍidi riṭṭĕ
tībula nābĕ nuramu diṁchuguvayyā