(॥పల్లవి॥)
మనసుకు మనసే మరి సాక్షి
తనివోని తమక మింతటా రాసులాయను
(॥మన॥)
కల గని చెలితోను కామిని యాడుకొనఁగా
కళలు మోముననెల్లాఁ గడు నిండెను
యెలమి నాకెను నీవు యేమిసేసితివోకాని
పలుకరాక ముదము పచ్చిదేరె నదివో
(॥మన॥)
తనతలఁపులోరతి దండవారితోఁ జెప్పఁగ
తనువునఁ బులకలు దట్టమాయను
పొనుఁగనిమీలోని భోగము లెటువంటివో
పెనఁగకే వలపులు పెనురాఁపు లాయను
(॥మన॥)
నిన్నుఁ జూచి మంతనాలు నెఁలతలతో నాడఁగ
చిన్ని నవ్వు సెలవులఁ జిందఁ జొచ్చెను
ఇన్నిటా శ్రీవేంకటేశ యీకె నెంత గూడితివో
యెన్నరాకె నేరుపులు ఇటు వహి కెక్కెను
(||pallavi||)
manasugu manase mari sākṣhi
tanivoni tamaga miṁtaḍā rāsulāyanu
(||mana||)
kala gani sĕlidonu kāmini yāḍugŏnam̐gā
kaḽalu momunanĕllām̐ gaḍu niṁḍĕnu
yĕlami nāgĕnu nīvu yemisesidivogāni
palugarāga mudamu pachchiderĕ nadivo
(||mana||)
tanadalam̐puloradi daṁḍavāridom̐ jĕppam̐ga
tanuvunam̐ bulagalu daṭṭamāyanu
pŏnum̐ganimīloni bhogamu lĕḍuvaṁṭivo
pĕnam̐gage valabulu pĕnurām̐pu lāyanu
(||mana||)
ninnum̐ jūsi maṁtanālu nĕm̐ladalado nāḍam̐ga
sinni navvu sĕlavulam̐ jiṁdam̐ jŏchchĕnu
inniḍā śhrīveṁkaḍeśha yīgĕ nĕṁta gūḍidivo
yĕnnarāgĕ nerubulu iḍu vahi kĕkkĕnu