Manasu pattamgaraadu maani vooragumdaraadu

మనసు పట్టఁగరాదు మాని వూరకుండరాదు
Language

(॥పల్లవి॥)
మనసు పట్టఁగరాదు మాని వూరకుండరాదు
యెనలేని తలపోఁత లెంత సేసీనే

(॥॥)
అప్పుడు విభుఁడు నాతో నానతిచ్చిన మాటలు
చెప్పఁగ సిగ్గయ్యీని చెలి నీతోను
కుప్పలుఁ దెప్పలు నై గుబ్బతిల్లీ మతిలోన
యెప్పుడు గానీ రాఁడో యేమి సేతునే

(॥॥)
చేపట్టి తా నేకతానఁ జేసిన చేఁతలు నీకు
చూపితేఁ బరవశాలు చుట్టు కొనీవి
దాఁపురాలై మేని మీఁద రాయక పాయకున్నవి
యేపునఁ దా నెందున్నాడో యేమి సేతునే

(॥॥)
యీకడ శ్రీ వేంకటేశుఁడిటు నన్నేలినందుకు
నాకు నీ మోము చూచితే నవ్వువచ్చీని
మేకొని వేడుక లలమేలుమంగను నేను
యేకమాయ మోహములు యేమి సేతునే

(||pallavi||)
manasu paṭṭam̐garādu māni vūraguṁḍarādu
yĕnaleni talabom̐ta lĕṁta sesīne

(||||)
appuḍu vibhum̐ḍu nādo nānadichchina māḍalu
sĕppam̐ga siggayyīni sĕli nīdonu
kuppalum̐ dĕppalu nai gubbadillī madilona
yĕppuḍu gānī rām̐ḍo yemi sedune

(||||)
sebaṭṭi tā negadānam̐ jesina sem̐talu nīgu
sūbidem̐ baravaśhālu suṭṭu kŏnīvi
dām̐purālai meni mīm̐da rāyaga pāyagunnavi
yebunam̐ dā nĕṁdunnāḍo yemi sedune

(||||)
yīgaḍa śhrī veṁkaḍeśhum̐ḍiḍu nannelinaṁdugu
nāgu nī momu sūside navvuvachchīni
megŏni veḍuga lalamelumaṁganu nenu
yegamāya mohamulu yemi sedune