మనసు నమ్మనేర్చితే మనుజుఁడే దేవుఁడౌను
(॥పల్లవి॥)
మనసు నమ్మనేర్చితే మనుజుఁడే దేవుఁడౌను
తనలోనే వున్నవాఁడు తావుకొని దైవము
(॥మన॥)
మగనిపై బత్తిచేసి మగువ యొక్కరితె
తెగి పరలోకము సాధించీనట
వొగి వీరవైష్ణవుఁడై వున్నవాఁడు హరిఁ గొల్చి
అగపడి ఘనమోక్షమంద నోపఁడా
(॥మన॥)
యేలికకై పగవారి నెదిరించి బంటొకఁడు
మేలైన పదవులంది మెరసీనట
వేళతో సుజ్ఞాని శ్రీవిష్ణుకైంకర్యాలుచేసి
కాలమందే యందరిలో ఘనుఁడు గానోపఁడా
(॥మన॥)
పరమపురుషార్థపుపని చేసి యెుకరుఁడు
అరిది నధికపుణ్యుఁ డయ్యీనట
నిరతి శ్రీవేంకటేశ నిన్నుఁ బూజించి దాసుఁడు
పరము నిహముఁ జెంది బ్రదుకఁగ నోపఁడా
(||pallavi||)
manasu nammanerside manujum̐ḍe devum̐ḍaunu
tanalone vunnavām̐ḍu tāvugŏni daivamu
(||mana||)
maganibai battisesi maguva yŏkkaridĕ
tĕgi paralogamu sādhiṁchīnaḍa
vŏgi vīravaiṣhṇavum̐ḍai vunnavām̐ḍu harim̐ gŏlsi
agabaḍi ghanamokṣhamaṁda nobam̐ḍā
(||mana||)
yeligagai pagavāri nĕdiriṁchi baṁṭŏgam̐ḍu
melaina padavulaṁdi mĕrasīnaḍa
veḽado sujñāni śhrīviṣhṇugaiṁkaryālusesi
kālamaṁde yaṁdarilo ghanum̐ḍu gānobam̐ḍā
(||mana||)
paramaburuṣhārdhabubani sesi yĕుkarum̐ḍu
aridi nadhigabuṇyum̐ ḍayyīnaḍa
niradi śhrīveṁkaḍeśha ninnum̐ būjiṁchi dāsum̐ḍu
paramu nihamum̐ jĕṁdi bradugam̐ga nobam̐ḍā