Manasu marmamuganna magamdu taanu

మనసు మర్మముగన్న మగఁడు తాను
Language

(॥పల్లవి॥)
మనసు మర్మముగన్న మగఁడు తాను
తనువుఁ దనువు సోఁక దండకు రమ్మనవే

(॥మన॥)
చనవులు చూపఁబోతే చప్పనవును తలపు
వినయము లేకుండితే వెలయదు వలపు
పెనఁగులాడితేను బెండుపడును వలపు
తన కెదురాడేనా దండకు రమ్మనవే

(॥మన॥)
చెలులతో నాడుకొంటే సిగ్గులు రేఁచును వలపు
వలెనని కొరితే వడిఁబెట్టు వలపు
పలుమారు నవ్వితేను పడనెక్కు వలపు
తలఁపించేఁ దనమాంట దండకు రమ్మనవే

(॥మన॥)
కడుదిష్టించి చూచితే కళదాఁకు వలపు
వొడివట్టి తీసితేను వుమ్మగిలు వలపు
యెడయక శ్రీవేంకటేశుఁడు తా నన్నుఁ గూడె
తడవితే వేడుకవయ్యీ దండకు రమ్మనవే

(||pallavi||)
manasu marmamuganna magam̐ḍu tānu
tanuvum̐ danuvu som̐ka daṁḍagu rammanave

(||mana||)
sanavulu sūbam̐bode sappanavunu talabu
vinayamu leguṁḍide vĕlayadu valabu
pĕnam̐gulāḍidenu bĕṁḍubaḍunu valabu
tana kĕdurāḍenā daṁḍagu rammanave

(||mana||)
sĕlulado nāḍugŏṁṭe siggulu rem̐sunu valabu
valĕnani kŏride vaḍim̐bĕṭṭu valabu
palumāru navvidenu paḍanĕkku valabu
talam̐piṁchem̐ danamāṁṭa daṁḍagu rammanave

(||mana||)
kaḍudiṣhṭiṁchi sūside kaḽadām̐ku valabu
vŏḍivaṭṭi tīsidenu vummagilu valabu
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ḍu tā nannum̐ gūḍĕ
taḍavide veḍugavayyī daṁḍagu rammanave