మనసు లొక్కటులైతే మరి యేల మఱఁగూ
(॥పల్లవి॥)
మనసు లొక్కటులైతే మరి యేల మఱఁగూ
పని గలితేఁ జేసే బాయిట నే వేయనూ
(॥మన॥)
నీ కెంత సంతోష మైనా నేడు నా సంతోస మదె
ఆకడ నీవు నవ్వితే నది నానవ్వె
లోకలోడిమాఁట గాదు లోను వెలి నొక్కటె
ఆకె నీడకె తేవయ్య నవుఁగాము లెంచను
(॥మన॥)
నీవు లెస్స వుండితే నేనె లెస్స వుండిన దది
లావు నీకుఁ గలితే నా లావూ నాదె
కావర మించుకాఁ గాదు కలగుణము నా కిది
వావులు చెప్పుకోరయ్య వద్దని నే ననను
(॥మన॥)
నీ మేలె నా మేలు నే నేరుపె నా నేరుపు
ప్రేమపు నీ ప్రియమె నా ప్రియ మిదివో
కామించి శ్రీవెంకటేశ గక్కనఁ గూడితి నన్ను
దోమటి దొడికించితే దూరను నే నాపెను
(||pallavi||)
manasu lŏkkaḍulaide mari yela maṟam̐gū
pani galidem̐ jese bāyiḍa ne veyanū
(||mana||)
nī kĕṁta saṁtoṣha mainā neḍu nā saṁtosa madĕ
āgaḍa nīvu navvide nadi nānavvĕ
logaloḍimām̐ṭa gādu lonu vĕli nŏkkaḍĕ
āgĕ nīḍagĕ tevayya navum̐gāmu lĕṁchanu
(||mana||)
nīvu lĕssa vuṁḍide nenĕ lĕssa vuṁḍina dadi
lāvu nīgum̐ galide nā lāvū nādĕ
kāvara miṁchugām̐ gādu kalaguṇamu nā kidi
vāvulu sĕppugorayya vaddani ne nananu
(||mana||)
nī melĕ nā melu ne nerubĕ nā nerubu
premabu nī priyamĕ nā priya midivo
kāmiṁchi śhrīvĕṁkaḍeśha gakkanam̐ gūḍidi nannu
domaḍi dŏḍigiṁchide dūranu ne nābĕnu