Manasu legamulaina manaloni valabulagu

మనసు లేకములైన మనలోని వలపులకు
Language

(॥పల్లవి॥)
మనసు లేకములైన మనలోని వలపులకు
తనివి దీరుచుకొనఁగ తరి నేఁడు గదరా

(॥మన॥)
యేకతంబునఁ గూడి యిద్దరము నొకరొకరు
జోక నెవ్మెము లటు చూచి చూచి
వాకుచ్చి గుఱిదాఁక వలపు పైఁ జల్లినను
కైకొనుచు లోలోనె కరఁగంగవలెరా

(॥మన॥)
బుజముపైఁ జేయి వేసి పొంచి మర్మము లంటి
గజరుఁగోరికలచేఁ గరఁచి కరఁగి
భజనఁ గొనగోరఁబైపైఁ గొప్పు గడు దువ్వి
గుజగుజలఁ దుదమాట గొణఁగంగవలెరా

(॥మన॥)
చెలఁగి విజనగరపు సింగారవనములో
వెలయుఁ గోనేటిఁ శ్రీవేంకటేశ
కొలఁది మీరినవేడ్కఁ గూడితిమి యిద్దరము
యిల మీఁద మనభాగ్య మెంచంగవలెరా

(||pallavi||)
manasu legamulaina manaloni valabulagu
tanivi dīrusugŏnam̐ga tari nem̐ḍu gadarā

(||mana||)
yegadaṁbunam̐ gūḍi yiddaramu nŏgarŏgaru
joga nĕvmĕmu laḍu sūsi sūsi
vāguchchi guṟidām̐ka valabu paim̐ jallinanu
kaigŏnusu lolonĕ karam̐gaṁgavalĕrā

(||mana||)
bujamubaim̐ jeyi vesi pŏṁchi marmamu laṁṭi
gajarum̐gorigalasem̐ garam̐si karam̐gi
bhajanam̐ gŏnagoram̐baibaim̐ gŏppu gaḍu duvvi
gujagujalam̐ dudamāḍa gŏṇam̐gaṁgavalĕrā

(||mana||)
sĕlam̐gi vijanagarabu siṁgāravanamulo
vĕlayum̐ goneḍim̐ śhrīveṁkaḍeśha
kŏlam̐di mīrinaveḍkam̐ gūḍidimi yiddaramu
yila mīm̐da manabhāgya mĕṁchaṁgavalĕrā