మనసూ నిలుపరాదు మగనిఁ దడవరాదు
(॥పల్లవి॥)
మనసూ నిలుపరాదు మగనిఁ దడవరాదు
యెనలేని నా మోహాన కేమి సేతునే
(॥॥)
విన్నపాలు సేసితేను వేసరించి నటు లయ్యీ
కన్నులఁ జూచితేను కాఁక రేఁచినటు లయ్యీ
చన్నుల నే నూదితేను సాదించినటు లయ్యీ
యెన్నికె లిట్టివి నేనేమి సేతునే
(॥॥)
కొలువులు సేసితేను కొసరినటుల నయ్యీ
పలికితే వలపులు పచారించినటు లయ్యీ
సెలవుల నవ్వితేను సిగ్గుపరచినట్లయ్యీ
యెలమి నా మొగమోట కేమి సేతునే
(॥॥)
చేరి పాదాలొత్తితేను చెనకినటుల నయ్యీ
మేరతోఁ గౌఁగిలించితే మీఱి పెనఁగిన ట్లయ్యీ
గారవించింతలో శ్రీ వేంకటేశుఁడు నన్నుఁగూడె
యీరీతి నా వేడుకల కేమి సేతునే
(||pallavi||)
manasū nilubarādu maganim̐ daḍavarādu
yĕnaleni nā mohāna kemi sedune
(||||)
vinnabālu sesidenu vesariṁchi naḍu layyī
kannulam̐ jūsidenu kām̐ka rem̐sinaḍu layyī
sannula ne nūdidenu sādiṁchinaḍu layyī
yĕnnigĕ liṭṭivi nenemi sedune
(||||)
kŏluvulu sesidenu kŏsarinaḍula nayyī
paligide valabulu pasāriṁchinaḍu layyī
sĕlavula navvidenu siggubarasinaṭlayyī
yĕlami nā mŏgamoḍa kemi sedune
(||||)
seri pādālŏttidenu sĕnaginaḍula nayyī
meradom̐ gaum̐giliṁchide mīṟi pĕnam̐gina ṭlayyī
gāraviṁchiṁtalo śhrī veṁkaḍeśhum̐ḍu nannum̐gūḍĕ
yīrīdi nā veḍugala kemi sedune